కొత్త జెర్సీలో కనబడబోతున్న ఆర్సిబి.. కారణమేమిటంటే..?!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విస్తరిస్తూ ఉంటే.అనేక హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి అందరికీ విదితమే.

 Reason Behind The New Blue Color Jersey Of Rcb In Ipl 2021-TeluguStop.com

అంతేకాకుండా రోజుకు ఆక్సిజన్  కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.అలాగే కొన్ని హాస్పిటల్స్ లో వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి.

అయితే ఈ క్రమంలో చాలా మంది ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వస్తున్నారు.

 Reason Behind The New Blue Color Jersey Of Rcb In Ipl 2021-కొత్త జెర్సీలో కనబడబోతున్న ఆర్సిబి.. కారణమేమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కరోనా పోరాటంలో భారతదేశానికి మేము అండగా ఉంటామని విరాట్ కోహ్లీ కెప్టెన్సి వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ముందుకు వచ్చింది.

అలాగే తమ వంతు సహాయం చేయడమే కాకుండా., విరాళాలు కూడా సేకరించి భారతదేశానికి అందజేస్తామని ఆర్సీబీ తెలియజేసింది.అందుకొరకు  కొత్తగా తయారు చేసిన బ్లూ కలర్ జెర్సీని ధరించి రానున్న మ్యాచులలో మైదానంలోకి అడుగు పెడతరని ఆర్సీబీ ఫ్రాంఛైజీ వారు తెలియజేశారు.ఇక ఆ జెర్సీలను  వేలం వేయగా వచ్చిన నిధులు అన్ని కూడా దేశంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది ఆర్సిబి.

ఈ సందర్బంగా విరాట్ మాట్లాడుతూ. “బెంగళూరుతో పాటు దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరత ఉందో.వైద్య పరికరాల అవసరం ఉందో అక్కడ ఆర్సీబీ సాయం అందిస్తుంది.అంతేకాకుండా రానున్న మ్యాచ్ లలో ప్రత్యేక జెర్సీ ధరించనున్నాం.

గతేడాది కొవిడ్ నియంత్రణలో భాగంగా ముందుండి పోరాడిన ఉద్యోగుల గౌరవార్థం ఈ జెర్సీలను ధరించనున్నాం.వీటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నాం ” అంటూ పేర్కొన్నాడు.

ఇక ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఆర్సిబి , కోల్​కతా నైట్​ రైడర్స్ తో సోమవారం నాడు అహ్మదాబాద్ వేదికగా తలపడబోతుంది.

#Season #Oxygen #RcbBlue #Social Media #Rcb Franchise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు