షకీలా చెంప పగలగొట్టిన సిల్క్ స్మిత.. ఎందుకంటే..?

శృంగార తారగా దక్షిణాది భాషల్లో పేరు తెచ్చుకున్న షకీలా బయోపిక్ షకీలా పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సినిమాలో షకీలా పాత్రలో హీరోయిన్ రిచా చద్దా నటిస్తున్నారు.

 When Silk Smitha Slapped Shakeela On The Sets Of Her Film, Silk Smitha ,shakeela-TeluguStop.com

ఈ సినిమా ద్వారా షకీలా జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలు వెలుగులోకి రానున్నాయి.అయితే నిన్న విడుదలైన ట్రైలర్ లో సిల్క్ స్మిత, షకీలా చెంప పగుగొట్టటం గురించి ప్రేక్షుల మధ్య చర్చ జరుగుతోంది.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం సిల్క్ స్మిత షకీలాను షూటింగ్ సమయంలో చెంప చెళ్లుమనిపించింది.ఈ సినిమా షూటింగ్ జరిగే సమయానికి సిల్క్ స్మితకు సౌత్ ఇండియా అంతటా మంచి గుర్తింపు ఉంది.

షకీలా సినిమా ఇండస్ట్రీలో అప్పుడే నటిగా కెరీర్ మొదలుపెట్టారు.ఒక సినిమాలో అక్కాచెల్లెళ్లుగా ఎంపికయ్యారు.

కథ ప్రకారం సిల్క్ స్మిత షకీలా చెంపపై కొట్టాలి.ఆ సినిమా డైరెక్టర్ రిహార్సల్ చేయమని చెప్పినా వినకుండా సిల్క్ స్మిత షకీలాను షూటింగ్ లొకేషన్ లో చాలా గట్టిగా చెంపపై కొట్టారు.

ఊహించని విధంగా సిల్క్ స్మిత అలా చేయడంతో షకీలాకు కొన్ని నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు.

Telugu Richa Chadda, Shakeela, Shakeela Biopic, Silk Smitha, Silksmitha-Movie

సిల్క్ స్మిత ప్రవర్తనతో బాధ పడిన షకీలా షూటింగ్ లొకేషన్ నుంచి వెళ్లిపోయారు.ఆ తరువాత కొన్ని రోజుల పాటు షకీలా ఆ సినిమా షూటింగ్ కు హాజరు కాలేదు.షకీలా వల్ల అవకాశాలు తగ్గుతున్నాయనే వ్యక్తిగత కారణం వల్ల సిల్క్ స్మిత ఆమె చెంప పగలగొట్టినట్టు తెలుస్తోంది.

గతంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన షకీలా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ పేరుతో విడుదలై సంచలన విజయం సాధించగా త్వరలో విడుదల కాబోతున్న షకీలా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube