ఆ సన్నివేశాల కారణంగానే డియర్ కామ్రేడ్ ని సాయి పల్లవి వద్దనుకుందా  

Reason Behind Sai Pallavi Reject Dear Comrade Movie-

ప్రస్తుతం టాలీవుడ్ మంచి రొమాంటిక్ జోడీ అంటే వెంటనే రష్మిక మందన, విజయ్ దేవరకొండ పేరు చెబుతారు.వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో వచ్చిన పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చిన ఆసక్తిగా చూడటానికి తెలుగు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు..

Reason Behind Sai Pallavi Reject Dear Comrade Movie--Reason Behind Sai Pallavi Reject Dear Comrade Movie-

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా డియర్ కామ్రేడ్ వస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతున్నాయి.ఇక త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ ని ఈ జోడీ ఇప్పటికే మొదలుపెట్టింది.

ఇదిలా ఉంటే డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని దర్శకుడు భరత్ కమ్ము అనుకున్నారు.ఇక ఆమెకి స్టొరీ కూడా చెప్పడం జరిగింది.అదే సమయంలో రష్మిక కి కూడా చెప్పడం జరిగింది.

అయితే సాయి పల్లవి కాస్తా లేట్ చేయడంతో రష్మిక వెంటనే ఒప్పుకోవడంతో ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిపోయింది.అయితే ఈ సినిమా స్టొరీ నచ్చిన ఒప్పుకోవడానికి సాయి పల్లవి లేట్ చేయడానికి గల కారణం ఇందులో ఉన్న ఘాటు ముద్దు సన్నివేశాలు అని తెలుస్తుంది.ముద్దు సన్నివేశాలలో నటించడానికి ఇష్టం లేని సాయి పల్లవి కావాలనే డియర్ కామ్రేడ్ చేయలేదని చెప్పుకుంటున్నారు.