షర్మిల పార్టీపై ఓ కన్నేసిన రేవంత్ రెడ్డి.. అసలు కారణమిదే?

తెలంగాణలో షర్మిల పార్టీ ప్రవేశం ఎవరూ ఊహించకుండా జరిగిందన్న విషయం మనకు తెలిసిందే.ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన షర్మిల పార్టీ అంశం ఆ తరువాత తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నట్లు షర్మిల ధృవీకరించిన విషయం తెలిసిందే.

 Reason Behind Revanth Reddy Observing Each And Every Moment Of Ys Sharmila, Reva-TeluguStop.com

అయితే ఆ తరువాత జిల్లాల వారీగా నేతలతో సమావేశమవడం, పార్టీ ఏర్పాటు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయానే విషయంపై పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించిన షర్మిల పార్టీ ఏర్పాటుకు మొగ్గు చూపింది.అయితే ఖమ్మం బహిరంగ సభలో పార్టీ పేరును, పార్టీ జెండాను ప్రకటిస్తానన్న షర్మిల ఆ సభలో ప్రకటించలేదు.

అయితే షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.అయితే కాంగ్రెస్ లో కీలకంగా మారిన రేవంత్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారితే రేవంత్ వెంట ఉన్న రెడ్డి సామాజిక వర్గం, ఇతర కాంగ్రెస్ నేతల వర్గం షర్మిల వైపు ఆకర్షించబడితే ఇటు రేవంత్ కు, కాంగ్రెస్ నాయకులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.అందుకే షర్మిల వేస్తున్న ప్రతి అడుగు, ఆ అడుగు వెనక వ్యూహాన్ని నిశితంగా రేవంత్ రెడ్డి గమనిస్తున్నాడట.

మరి రేవంత్ కు షర్మిల ఝలక్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube