జేపీకి మోడీ, అమిత్‌ షా సంతాపంకు కారణం ఏంటీ?

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి నిన్న గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన బాత్‌ రూంలో ఉండగా గుండె పోటు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిజేశారు.

 Pm Modi Condoles To Telugu Actor Jaya Prakash Reddy-TeluguStop.com

ఆయన మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు పలువురు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం అయ్యింది.

ఈ సమయంలో సినీ ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు కూడా శ్రద్దాంజలి ఘటించారు.ముఖ్యంగా ప్రధాని తెలుగులో ట్వీట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రధాని స్థాయి వ్యక్తి జేపీకి శ్రద్దాంజలి ఘటించారు అది కూడా తెలుగు భాషలో అంటే మామూలు విషయం కాదు.

జేపీ ఒక తెలుగు సినిమా నటుడు.

ఆయన హిందీలో కూడా పెద్దగా నటించింది లేదు.అక్కడి వారిలో గుర్తింపు ఉండే నటుడు కూడా కాదు.

అయినా కూడా జాతీయ స్థాయి నేతల సంతాపం దక్కడం ఏంటంటూ చాలా మంది ఆశ్చర్య పోతున్నారు.దాంతో జేపీ గతంలో బీజేపీలో ఏమైనా పని చేశారా, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటీ అనే విషయాలను గూగుల్‌ చేస్తున్నారు.

గూగుల్‌ లో వస్తున్న ఫలితాల సంగతి ఏమో కాని జేపీ గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తున్నాయి.ఆయన నటించిన పలు సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి.

విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జేపీ కెరీర్‌ చివర్లో మాత్రం పూర్తిగా కామెడీ పాత్రలపై ఆసక్తి చూపించారు.ఆయన సీరియస్‌గా ఉన్నా కూడా ప్రేక్షకులు నవ్వుకునేవారు.

ఆయన ఒక గొప్ప నటుడు.అందుకే ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేనిది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆయనకు ఉన్న ప్రతిభ మరియు ఆయన సాధించిన విజయాల కారణంగానే ప్రధాని మోడీ మరియు అమిత్‌ షాలు ఆయనకు సంతాపం తెలిపి ఉంటారు.వారు ఏ కారణంతో తెలిపినా కూడా మన జేపీకి ఆ స్థాయి వ్యక్తుల నుండి సంతాపం దక్కడం అంటే చాలా పెద్ద గౌరవం.

ఆయన్ను మనం కూడా అంతే గౌరవించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube