పిస్తా అత్యంత ఖరీదైనది కావడం వెనుకనున్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పిస్తా పప్పు అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అని అంటారు.అయితే అది ఇంత ఖరీదుగా మారడానికి గల కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? పిస్తాను పండించడం, వాటి చెట్లను సంరక్షించడం అంత సులభం కాదు.ఒక పిస్తా చెట్టు ఫలసాయం ఇవ్వడానికి 15 నుండి 20 సంవత్సరాలు పడుతుంది.ఇంతే కాకుండా వీటి ఖదీదు అత్యధికంగా ఉండటానికి అనేక కారణాలున్నాయి.పిస్తాల డిమాండ్‌ను తీర్చలేకపోవడమూ ఒక కారణమే.కాలిఫోర్నియా, బ్రెజిల్‌తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.

 Do You Know The Reason Behind Pista Being So Expensive Plant Year Health Weather-TeluguStop.com

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ (సీఎస్ఐఆర్)కు చెందిన నిపుణులు ఆశిష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒక పిస్తా చెట్టు 15 నుండి 20 సంవత్సరాల తర్వాత కాపునకు వస్తుంది.

అప్పుడు కూడా దానిని పండించే రైతు తక్కువ మొత్తంలోనే పిస్తాలను అందుకోగలుగుతాడు.

సగటున ఒక పిస్తా చెట్టు సంవత్సరానికి 22 కిలోల పిస్తాలను అందిస్తుంది.పిస్తాకున్న డిమాండ్ ప్రకారం, దాని ఉత్పత్తి ఎప్పుడూ చాలా తక్కువగానే ఉంటుంది.

బ్రెజిల్ దేశంలో ప్రతి సంవత్సరం ఒక పిస్తా చెట్టు నుండి 90 కిలోల పిస్తాపప్పులు ఉత్పత్తి అవుతాయి.పిస్తా చెట్ల సంరక్షణకు తగినంత నీరు, అధికంగా కూలీలు, ఎక్కువ భూమి, అధిక వ్యయం అవసరం.

ఇక్కడ మరొక విశేషమేమిటంటే ఏటా చెట్లకు పిస్తాలు రావు.అందువల్ల, రైతులు రెండు పంటలు వేయాలి.పంట చేతికొచ్చాక కూలీలు ఒక్కో పిస్తాను చేతితో పగలగొట్టి శుభ్రం చేస్తారు.నాణ్యతను బట్టి వాటిని వేరు చేస్తారు.ఇందుకోసం కార్మికులకు అధికమొత్తంలో డబ్బులు చెల్లించాల్సివుంటుంది.హెల్త్‌లైన్ తెలిపిన వివరాల పిస్తాలు మన శరీర బరువును, బ్లడ్ షుగర్ ను కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి.

Why Are Pistachios So Expensive Pista Dry Fruit

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube