పవన్ మౌనం వెనుక ట్విస్ట్ ఇదేనటగా ?

పరిస్థితులను బట్టి, సందర్భానుసారంగా స్పందించేవాడే రాజకీయ నాయకుడు.ఎప్పుడు ఎక్కడ ఏ విషయంపై మాట్లాడాలో తెలియడమే కాదు, మాట్లాడకుండా ఉండడం కూడా తెలిసి ఉండాలి.

 Pawan Kalyan, Ycp Leaders, Tdp, Water Issue, Rayalaseema, Janasena, Reason Behin-TeluguStop.com

ఇప్పుడు అదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.గత కొద్ది రోజులుగా తెలంగాణ ఆంధ్ర మధ్య పోతిరెడ్డిపాడు వివాదం పెద్ద ఎత్తున చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్ధ్యాన్ని పెంచుతూ, ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో పై తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర జలవనరుల మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు.ఇక ఈ విషయంలో ఇప్పటికే ఏపీ బీజేపీ జగన్ కు మద్దతుగా మాట్లాడుతుండగా, పవన్ మాత్రం అసలు ఈ వ్యవహారంలో తలదూర్చకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

పవన్ ఇప్పటికే బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఏపీ బీజేపీ శాఖ పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, పవన్ మాత్రం ఈ విషయంలో తలదూర్చకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కనీసం ఈ విషయంపై స్పందించేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదు.

Telugu Janasena, Pawan Kalyan, Rayalaseema, Pawan Silence, Ycp-Telugu Political

గతంలో అనేక సందర్భాల్లో రాయలసీమపై తనకు ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని పవన్ చెప్పుకున్నారు.రాయలసీమ అభివృద్ధి తన లక్ష్యమని, తనకు ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ అంటూ అనేక సందర్భాల్లో పవన్ చెప్పుకున్నారు.దీంతో రాయలసీమకు మేలు చేసే ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ మౌనంగా ఉండడం పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి.

అనుకూలంగానో, వ్యతిరేకంగానో పోతిరెడ్డిపాడు విషయంపై పెదవి విప్పాలని డిమాండ్ పెరుగుతోంది.వైసిపి నాయకులు కూడా టిడిపి, జనసేనను టార్గెట్ చేసుకుని తమ స్పందన తెలియజేయాలి అంటూ పట్టుబడుతున్నారు.

ఇక ఏపీ బీజేపీ ఇప్పటికే తమ స్పందనను తెలియజేసినా, అసలు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది బీజేపీ నినాదం అనే విషయాన్ని ఏపీ బిజెపి నాయకులు చెబుతూ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

Telugu Janasena, Pawan Kalyan, Rayalaseema, Pawan Silence, Ycp-Telugu Political

రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఆయన ఆలోచన.ఈ విషయంలో తాను ఏ విధంగా స్పందించినా, ఒక రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని ఈ విషయంలో పవన్ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తే, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు.

ఈ విషయం పవన్ కు తెలిసినా, రాజకీయంగా తనకు చేటు తెస్తుందనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉన్నారు .అసలు టిడిపి, జనసేనను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జగన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.అందుకే ఈ విషయంలో తమపై ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించ కూడదు అనే అభిప్రాయానికి పవన్ వచ్చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube