బాలయ్య శ్రీదేవితో అందుకే నటించలేదా?

తెలుగు సినీ సీనియర్ స్టార్ నటుడు నందమూరి బాలయ్య గురించి తెలినోలే లేరు.ఇక ఈయన సినిమాలంటే నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు.

 Reason Behind No Movie In Sridevi Balakrishna Combo-TeluguStop.com

బాలయ్య కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.నాటి నుండి నేటి వరకు ఇండస్ట్రీలో ఇంకా కీలక పాత్రలో నటిస్తున్నాడు బాలయ్య.

అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నాడు.

 Reason Behind No Movie In Sridevi Balakrishna Combo-బాలయ్య శ్రీదేవితో అందుకే నటించలేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే బాలయ్య సరసన చాలావరకు నాటినుండి నేటి వరకు సీనియర్ హీరోయిన్స్ నుండి ఈ తరం హీరోయిన్స్ వరకు ఎంతోమంది నటించారు.

కానీ అలనాటి తార శ్రీదేవి సరసన మాత్రం బాలకృష్ణ ఏ ఒక్క సినిమా కూడా చేయలేదు.అంతేకాకుండా శ్రీదేవి కూడా స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కానీ బాలయ్య సరసన మాత్రం నటించలేదు.కానీ వీరిద్దరి కాంబినేషన్ లో మాత్రం రెండు సినిమాలు రావాల్సి ఉండేనట‌.

డైరెక్టర్ రాఘవేంద్ర రావు తన దర్శకత్వంలో 1987లో సామ్రాట్ అనే సినిమాను ప్రకటన చేశాడట.ఈ సినిమాను బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కించాలనుకున్నాడట.ఆ తర్వాత 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ అనే సినిమాలో శ్రీదేవి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.కానీ శ్రీదేవి ఆ సమయంలో హిందీ సినిమాలలో వరుస ఆఫర్ లతో తెగ బిజీగా ఉండేనట‌.

ఇక ఆ సమయంలో శ్రీదేవి బిజీగా ఉన్నందున బాలకృష్ణ ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పకుందని తెలిసింది.ఇక ఆ తర్వాత బాలయ్యతో ఏ ఒక్క సినిమా కూడా నటించలేదు.

ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు.

#Acting #Balakrishna #Sridevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు