‘ఎన్టీఆర్‌’ను క్రిష్‌ కాదనడానికి కారణం ఇదేనా?  

తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు జాతి కీర్తిని నలు దిశలా వ్యాప్తింపజేసిన నందమూరి తారక రామారావు జీవిత చిత్ర ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. కాని ఇటీవలే తేజ తాను ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే చర్చ జరిగింది..

‘ఎన్టీఆర్‌’ను క్రిష్‌ కాదనడానికి కారణం ఇదేనా?-

తేజ తప్పుకున్నాడు అనగానే ఎక్కువ మంది క్రిష్‌ అయితే ఈ ప్రాజెక్ట్‌కు న్యాయం చేయగలడని అంతా భావించారు. అందుకే బాలయ్య స్వయంగా క్రిష్‌తో సంప్రదింపులు జరపడం జరిగింది. కాని బాలయ్య ప్రతిపాదనను సున్నితంగా క్రిస్‌ తిరష్కరించడం జరిగింది.

క్రిష్‌ నో చెప్పడంతో రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో బాలయ్య స్వయంగా ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే క్రిష్‌ ఎందుకు ఈ చిత్రంకు నో చెప్పాడు అనే విషయమై సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బాలకృష్ణ పూర్తి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. ఆయన అనుకున్న ప్రకారంగానే స్క్రిప్ట్‌, సీన్స్‌, సినిమా అంతా జరగాల్సి ఉంటుంది.

అలా కొందరు వేలు పెడితే క్రిష్‌కు ఇష్టం ఉండదు. ఆ కారణంగానే క్రిష్‌ ఈ చిత్రాన్ని చేయను అంటూ తేల్చి చెప్పి ఉంటాడు అంటూ కొందరు భావిస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఆయనకు సంబంధించి అన్ని పాజిటివ్‌ విషయాలను మాత్రమే చూపించబోతున్నారు..

ఒక బయోపిక్‌ అన్నప్పుడు పాజిటివ్‌ మరియు నెగటివ్‌లను చూపిస్తేనే ఆ బయోపిక్‌ పూర్తి అర్థవంతంగా ఉంటుంది. కాని నెగటివ్‌లు చూపిస్తాను అంటే బాలయ్యతో పాటు నందమూరి అభిమానులు ఊరుకోరు. ఆకారణంగా కూడా క్రిష్‌ ఈ చిత్రంను టేకోవర్‌ చేసేందుకు ఆసక్తి చూపించి ఉండడు అంటూ మరి కొందరు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి తేజ ఈ చిత్రం నుండి తప్పుకోవడం పెద్ద మైనస్‌ అని చెప్పుకోవచ్చు.

బాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే అంతా ఏకపక్షంగా సాగే అవకాశం ఉందని, ఎన్టీఆర్‌ కంటే చంద్రబాబు నాయుడు పాత్రను ప్రధానంగా చేసే అవకాశం ఉందని, తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు లేడు. అయినా కూడా ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలో ఆయన్ను హీరోగా చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలా కనుక చేస్తే ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని ఇప్పటి నుండే విశ్లేషకులు తమ అభిప్రాయంను చెబుతున్నారు. అతి త్వరలోనే దర్శకుడు ఫైనల్‌ అయ్యి, సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.