ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌ని " జ‌గ‌న్ " మాయ‌

నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు మౌనంగా ఉండ‌డమూ పాలిటిక్స్‌లో ఓ క‌ళే! స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భులైన గిరీశం మాస్టారులా రాజ‌కీయాలు చేయ‌డం నావ‌ల్ల కాదంటుంది క‌న్యాశుల్కంలో మ‌ధుర‌వాణి!! అలా.ఇప్పుడు మ‌న‌కూ ఓ పొలిటిక‌ల్‌ గిరీశం దొరికాడ‌ని తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు ఏపీ ప్ర‌జ‌లు! ఇంత‌కీ ఆ గిరీశం ఎవ‌ర‌నేనా?!! ఎంత తిట్టినా ఉలుకూ ప‌లుకూ లేకుండా.త‌న‌నేం ప్ర‌శ్నించినా.ఎలాంటి స‌మాధాన‌మూ ఇవ్వ‌కుండా.ముఖ్యంగా ముఖ్య మంత్రి పీఠమే ల‌క్ష్యంగా పెట్టుకుని.నీ కంటికేం క‌నిపిస్తోందంటే.

 Reason Behind Jagan Silence On Remarks-TeluguStop.com

సీఎం సీట‌ని ఠ‌క్కున స‌మాధాన మిచ్చే వైకాపా అధినేత జ‌గ‌న్‌!!

ప‌బ్లిక్‌లోకి రావ‌డం అంటే మాట‌లు కాదు.ఎన్ని హార‌తులు ప‌డతారో.

అన్ని తిట్లూ తిట్టే జ‌నాలు మ‌న చుట్టూనే ఉంటారు.వారి పొగ‌డ్త‌ల‌కి పొంగిపోవ‌డ‌మే కాదు, వారి తిట్ల‌కు స‌మాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది.

అయితే, మ‌న జ‌గ‌న్ మాత్రం ఫ‌స్ట్ టైప్‌! అంటే.అచ్చు గిరీశం మాదిరిగా హార‌తులు మాత్ర‌మే ప‌ట్టించుకుని, తిట్లు, విమ‌ర్శ‌ల‌ను మాత్రం ప‌క్క‌కు నెట్టేసే టైపు.

ఇప్పుడు ఇదే చ‌ర్చ‌నీయాంశం అయింది.నువ్వు అవినీతికి పాల్ప‌డ్డావు.

మీ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించావు.ఈ సాక్షి విష పుత్రిక‌.

మీ నాన్న పార్థివ దేహాన్ని ఇంట్లో పెట్టుకునే.సీఎం సీటు కోసం రాజ‌కీయాలు చేశావు.

సీఎం సీటు ఇవ్వ‌లేద‌నే సోనియాను ఏకేశావు.పార్టీ మార్చేశావు – ఇలా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.

ఏ ఒక్క‌దానికీ స్పందించ‌ని ఏకైక నేత జ‌గ‌న్‌!

అస‌లు… స్థితః ప్ర‌జ్ఞ‌త గురించి గీత‌లో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు కానీ.అదే కృష్ణుడు ఇప్పుడు బంజారాహిల్స్‌కి వ‌స్తే.

అస‌లు సిస‌లు.స్తితఃప్ర‌జ్ఞ‌త ఏంటో జ‌గ‌న్‌ను చూసి నేర్చుకునేవాడేమో!! ఎవ‌రు ఏమ‌న్నా.

ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా చ‌లించ‌ని ఏకైక ప్ర‌జా నేత జ‌గ‌న్‌.ఇప్పుడు తాజాగా రూ.500, రూ.1000 నోట్ల‌ను కేంద్రం ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున జ‌గ‌న్‌పై విరుచ‌కుప‌డుతున్నారు.త‌న ద‌గ్గ‌రున్న వేల కోట్ల పెద్ద నోట్ల‌ను ఎలా మార్చుకోవాలో తెలీక జ‌గ‌న్‌కి జ్వ‌రం వ‌చ్చింద‌ని ఒక‌ళ్లు అంటే.టెన్ష‌న్‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నాడ‌ని మ‌రొక‌రు కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ ప్లేస్‌లో ఇంకెవ‌రైనా ఉండి ఉంటే.త‌క్ష‌ణం స్పందించి వాటివి వివ‌ర‌ణ ఇవ్వ‌డ‌మో.

ఎదురు దాడి చేయ‌డ‌మో.చేస్తారు.

కానీ, మ‌న జ‌గ‌న్ మాత్రం గిరీశం మాదిరిగా చేయాల్సింది చేసేసి కిమ్మ‌న‌కుండా త‌ప్పించుకుంటాడు.పాలిటిక్స్‌లో ఇదీ ఓ క‌ళే అయినా.

ట్రెండ్ మారుతోంది కాబ‌ట్టి.జ‌గ‌న్ కూడా మాట్లాడాలి.

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పితీరాలి అనే వారూ ఉంటారు క‌దా?! మ‌రి జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం ఏమిటో? ఎవ‌రికి అంతుబ‌డుతుందో? అంతా జ‌గ‌(న‌)మంత మాయ‌!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube