'ఐ' ఫేల్యూర్ వెనుక అసలు కారణం

సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ “ఐ” నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ చిత్రం శంకర్ గతంలో నిర్మించిన అన్ని చిత్రాలతో పోలిస్తే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.

 Reason Behind “i” Movie Failure-TeluguStop.com

దాదాపుగా అధిక శాతం అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రంపై పెదవి విరుస్తున్నారు.దానికి గల కారణాలు అనేకం అంటున్నాయి తమిళ వర్గాలు.

వివరాల్లోకి వెళితే దాదాపుగా 100కోట్ల రూపాయలతో చిత్రాన్ని భారీగా తెరకెక్కించిన శంకర్ అసలు చిత్రంలో కధనే మరచిపోవడం విశేషం.గతంలో తను తీసిన ప్రతి సినిమాలోను ఎదో ఒక మెసేజ్ చెప్పే శంకర్ దీనికి భిన్నంగా ‘ఐ’ ను కథ లేకుండా కేవలం టెక్నాలజీని నమ్ముకుని నిర్మించడం వలనే శంకర్ కు ఆశించిన రిజల్ట్ రాలేదు అనేమాటలు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో శంకర్ నిర్మించిన సినిమాలకు మూలకథలు చాలావరకు ఆయనవి కావు, స్క్రీన్ ప్లేలు మాత్రమే ఆయన తయారుచేసేవాడు.మొదట్లో బాలకుమురన్ అనే సుప్రసిద్ధ తమిళ రచయిత శంకర్ సినిమాలకు కథలు అందించారు.

‘జంటిల్ మన్’, ‘ప్రేమికుడు’, ‘జీన్స్’ సినిమాల కథలు ఆయనవే.ఆతరువాత సుజాత రంగరాజన్ తన కథలను శంకర్ సినిమాలకు ఇచ్చారు.

‘ఒకే ఒక్కడు’, ‘భారతీయడు’, ‘రోబో’ వంటి సినిమాల కథలు ఇచ్చింది సుజాత రంగరాజన్.అయితే ఈరచయితతో శంకర్ కు ఏమి భేదాభిప్రాయాలు వచ్చాయో తెలియదు కాని ఆరచయితను మార్చి శంకర్ తన సొంతంగా కొంతమంది సహాయకుల సహాయంతో ‘ఐ’ సినిమా కథ విషయంలో చేసిన సొంత ప్రయోగం వల్ల శంకర్ పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు.

మరి అంత కష్టపడి, విక్రమ్ ను అంత కష్ట పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం పై శంకర్ కు విశ్వాసమో, అతి విశ్వాసమో తెలీదు కానీ.మొత్తానికైతే “ఐ” శంకర్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా ముద్రపడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube