హిందూ సాంప్రదాయం ప్రకారం జడకు మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీ జడకు ఎంతో విశిష్టత ఉంది.మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలు జడ వేసుకోవడం తప్పనిసరి.

 Reason Behind Hindu Women Hair Tied In A Plait O -braid Hindu Rituals, Hindu Bel-TeluguStop.com

అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్ల వివిధ రకాలుగా కట్ చేసుకోవడం చూస్తున్నాము.అదే రెండు తరాల ముందు వారు ఎప్పుడు జడను చక్కగా అల్లుకొని వివిధ రకాల పుష్పాలను పెట్టుకొని, అదేవిధంగా జడకు వివిధ రకాల నగలను అలంకరించుకొని ఎంతో అందంగా ముస్తాబు అయ్యేవారు.

పూర్వకాలంలో చిన్నపిల్లలు రెండు జడలు వేసుకునేవారు.అదేవిధంగా పెళ్లీడుకొచ్చిన యువతులు ఒక జడ వేసుకునేవారు.అదే పెళ్లి జరిగే సంతానం కలిగిన వారు జడకు ముడివేసే జడ చుట్టూ పువ్వులు పెట్టుకునేవారు.అంతేకానీ అప్పట్లో ఏ స్త్రీ కూడా జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరిగేవారు కాదు.

ఈ విధంగా జుట్టు విరబోసుకుని తిరగడం వల్ల ఇంటికి జేష్టాదేవికి అనుగ్రహం కలుగుతుందని,జేష్టాదేవి ప్రభావం మన ఇంటి పై ఉంటే ఇంటిలో ఎన్నో కష్టాలు కలుగుతాయని చెప్పేవారు.అందుకోసమే స్త్రీలు తలను ఎంతో చక్కగా దువ్వి తల వెంట్రుకలను మూడు పాయలుగా తీసుకొని అల్లుకొనేవారు.

అయితే ఈ విధంగా మూడు పాయాలే ఎందుకు తీసుకొనేవారో ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Hindu, Hindu Rituals, Jadakoppu, Okka Jada, Rendu Jadalu, Womens Dharma-T

అప్పట్లో చిన్న పిల్లలకు జడలు వేసిన, యువతులు జడ వేసుకున్నా,జుట్టుని మూడు పాయలుగా విడదీస. త్రివేణి సంగమంలా కలుపుతూఅల్లేవారు ఈ మూడు పాయలకు కూడా మన హిందూ ధర్మంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి.

* స్త్రీ జడ మూడుపాయలకు తన భర్త,తాను,తన సంతానం అనే అర్థాన్ని సూచిస్తాయి.

*సత్వ, రజ, తమో గుణాలు, *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే అర్థాలు వస్తాయి.ఈ తతంగం స్త్రీలు వేసుకునే జడ బట్టి వారు చిన్న పిల్లలా, లేక అవివాహితుల, పెళ్లి సంతానం కలిగిన వారా అనే విషయాలను ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube