జానా విజయంపై ధీమాగా కాంగ్రెస్... అసలు కారణం ఇదే

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ప్రజల మద్దతు చూరగోనేలా లేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్వారా మనకు అర్ధమవుతుంది.ఎందుకంటే కాంగ్రెస్ అనేది రోజురోజుకు బలహీనంగా మారుతోంది.

 Congress Confident Over Jana Reddy Win , Nagarjuna Sagar By Elections, Bjp Vs Co-TeluguStop.com

అంతర్గత కలహాలు ఒక కారణమైతే పటిష్ట నాయకత్వం లేకపోవడం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు.అయితే గ్రేటర్ ఎన్నికల ఓటమితో పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి నాయకత్వ లోపంతో కాంగ్రెస్ బాధపడుతోంది.ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయానికొస్తే నాగార్జున సాగర్ నుండి ఇప్పటి వరకు 7 సార్లు జానారెడ్డి గెలుపొందాడు.

అయితే కేసీఆర్ హవాలో భాగంగా తన ప్రత్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో 7 వేల ఓట్లతో ఓడిపోయాడు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జానా గెలుపు పట్ల నమ్మకంగా ఉంది.

ఎందుకంటే జానా రెడ్డి అక్కడ బలమైన నేతగా ఉండటం ఒక కారణం కాగా, నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్ తండ్రి చాటు కొడుకుగా పెరిగాడు.తప్ప ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు.

కేటీఆర్ లాంటి నేతలు ప్రచారం చేసినా అభ్యర్థి గుర్తింపు రావడానికి తోడ్పాడతారు తప్ప పెద్దగా నోముల భగత్ గెలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది.ఇక బీజేపీ అభ్యర్థి అసలు జానాకి పోటీయే కాదని కాంగ్రెస్ భావిస్తోంది.

మరి కాంగ్రెస్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube