రెండు సంవత్సరాలు దాటాయి అనుకుంటా, మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా మొదలుపెడతానని చెప్పి.అప్పుడు, ఇప్పుడు, త్వరలో అంటూ ఊరించి ఊరించి, ఎట్టకేలకు ముహూర్తం అయితే కానిచ్చారు.
కాని సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా తెలియట్లేదు.
షూటింగ్ అంత త్వరగా మొదలవడం కష్టమే అంట.దానికి ఒక బలమైన కారణమే ఉంది.మెగాస్టార్ చిరంజీవి ఒక విషయం పట్ల భయపడుతున్నారు కాబట్టే షూటింగ్ వాయిదా పడుతోందని సినీవర్గాల సమాచారం.
విషయం ఏమిటంటే, కత్తి సినిమాకి సంబంధించిన కథపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే కదా.నరసింహారావు అనే రచయిత, ఈ కథ తనదే అని, మురుగదాస్ దొంగలించాడని, రచయితల సంఘం, ఫిలించాంబర్ చుట్టూ తిరుగుతున్నాడు.
ఈ వివాదం ఎటువైపు మళ్ళుతుందో తెలియని పరిస్థితి.అసలు ఈ కథ మురుగదాస్ సొంతంగా రాసుకున్నదేనా అనే విషయం తేలాలి ముందు.తొందరపడితే హక్కుల గొడవ తన మెడకు చుట్టుకుంటుందనేదే చిరంజీవి భయం.అందుకే బ్యాక్ అప్ కోసం, వినాయక్ తో మరో కొత్త కథ సిద్ధం చేయించుకున్నారు మెగాస్టార్.సో, మెగాస్టార్ 150 వ సినిమా కత్తి రీమేక్ అని అప్పుడే ఫిక్స్ అయిపోకండి.