ఆ ఒక్క నిర్ణ‌యంతో ఏపీలో బీజేపీ చాలానే కోల్పోతోందా..?

రాష్ట్రంలో ఎద‌గాలి.అధికారంలోకి రావాల‌నుకున్న పార్టీ ఏదైనా.

 Is Bjp Loss In Ap For Only That Reason,ap,andhra Pradesh,chief Minister,jagan Mo-TeluguStop.com

ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటుంది.ఈ క్ర‌మంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను ప‌క్కాగా అనుస‌రిస్తుంది.

కానీ, బీజేపీ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.ఆదిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న పార్టీ.కాపు నేతే సీఎం అవుతార‌ని నొక్కిచెబుతున్న పార్టీలో అంత‌ర్గ‌త ఆదేశాలు ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేయ‌లేక పోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌పై బీజేపీ త‌న అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల్సి ఉంటుంది.ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.బీజేపీ లైన్ ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు ఆయా విష‌యాల‌పై క్లారిటీ ఇస్తే.ప్ర‌జ‌ల్లో త్వ‌ర‌గా పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇదే సూత్రాన్ని క‌మ్యూనిస్టులు, టీడీపీనేత‌లు కూడా అనుస‌రిస్తున్నారు.త‌మ‌కు ఇష్టంగా ఉన్న విష‌యాల‌తోపాటు క‌ష్టంగా ఉన్న అంశాల‌పైనా ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇస్తున్నారు.

దీనికి సంబంధించి టీవీల్లో వ‌స్తున్న డిబేట్ల‌ను అన్ని పార్టీలూ స‌ద్వినియోగం చేసుకుంటున్నాయి.

Telugu Andhra Pradesh, Somu Veera Raju-Telugu Political News

వైసీపీ నేతలు కూడా టీవీ డిబేట్ల‌లో పార్టిసిపేట్ చేస్తూ.త‌మ పంథాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.కానీ, ఘ‌న‌త వ‌హించిన బీజేపీ మాత్రం టీవీ డిబేట్ల‌కుఎవ‌రూ వెళ్ల‌రాద‌ని నియ‌మం పెట్ట‌డం, వెళ్లినా అంశాల‌ను ఎంచుకుని మాట్లాడాల‌ని ష‌రతు పెట్ట‌డం వంటివి పార్టీని ప్ర‌జ‌లకు దూరం చేస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో లేదు.కానీ, సోము వీర్రాజు పార్టీ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.టీవీ డిబేట్ల‌పై త‌న‌దైన కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చారు.
త‌న‌కు న‌చ్చిన వారికి మాత్రమే పార్టీత‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం ఇస్తున్నారు.

మిగిలిన వారిపై వేటు వేస్తున్నారు.దీంతో లంకా దిన‌క‌ర్ వంటి గ‌ట్టి వాయిస్ ఉన్న నేత‌ల‌ను కూడా స‌స్పెండ్ చేయ‌డం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

అస‌లు కరెంట్ ఇష్యూల‌పై మాట్లాడే వారే త‌క్కువ‌గా ఉన్న నేటి త‌రంలో ఎంతో కొంత మాట్లాడుతూ.పార్టీ వాయిస్ వినిపించేవారిపై ఉక్కుపాదం మోప‌డం స‌రికాద‌ని అంటున్నారు.

మ‌రి సోము వింటారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube