అంగారక గ్రహం పుట్టుక వెనుక గల రహస్యం ఏమిటో తెలుసా..?

Reason Behind The Birth Of Mars According To Hindu Puranas , Mars, Secret, Solar Family,Blind Man, Kuja Graham, Aruna Graham, Red Color, Vishnumoorthy, Bhudevi, Parameshwara, Andhakasurudu

గ్రహాలలో ఒకటిగా, గ్రహాలకు సేనాధిపతిగా, ఉగ్ర స్వభావవుడిగా అంగారక గ్రహాన్ని పరిగణిస్తారు.ఈ సౌర కుటుంబంలో నాలుగవ గ్రహమైన అంగారక గ్రహాన్ని కుజ గ్రహం అని కూడా పిలుస్తారు.

 Reason Behind The Birth Of Mars According To Hindu Puranas , Mars, Secret, Solar-TeluguStop.com

ఈ గ్రహం ఎంతో ఎరుపు రంగును కలిగి ఉండటం వల్ల దీనిని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు.అయితే ఈ అంగారక గ్రహం ఎరుపు రంగును కలిగి ఉండటానికి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి.

అయితే అంగారక గ్రహం ఈ విధంగా ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలు, ఆ పురాణ కథలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ఈ అంగారక గ్రహం పుట్టుక గురించి మన హిందూ పురాణాలలో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు, భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

ఒకరోజు ఆ విష్ణుభగవానుడు చెమట చుక్క భూమి పై పడటం వల్ల భూమి నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు.ఆ బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారుతాడు.

ఆగ్రహమే కుజ గ్రహం అని పద్మపురాణం తెలియజేస్తోంది.

Telugu Andhakasurudu, Aruna Graham, Bhudevi, Blind, Kuja Graham, Mars, Parameshw

స్కంద పురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడుకి ఆ పరమశివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు.అంధకాసురుడి రక్తం బొట్టు నుంచి 100 మంది రాక్షసులు పుట్టే విధంగా వరం పొందిన అంధకాసురుడి నుంచి ప్రజలను రక్షించాలంటే అంధకాసురుడిని సంహరించాలని ఆ పరమశివుడు రాక్షసునితో పోటీ పడ్డాడు.ఈ భయంకరమైన పోరాటంలో ఆ పరమేశ్వరుడి చెమట ధారలుగా ప్రవహించి ఆ చెమటల వేడికి ఉజ్జయిని నగరం చీలికగా ఏర్పడటంవల్ల అంగారక గ్రహం ఏర్పడిందని స్కంధ పురాణం చెబుతోంది.

ఈ విధంగా భూమి చీలికలో నుంచి పుట్టడం వల్ల సాక్షాత్తు భూదేవి తన సొంత కొడుకు కుజ గ్రహాన్ని భావించిందని ఈ పురాణం తెలియజేస్తుంది.ఎట్టకేలకు ఆ పరమశివుడు అంధకాసురుడని సంహరించి కొత్తగా సృష్టించిన మరొక అంగారడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు.

అందుకోసమే కుజుడు ఎరుపురంగును పోలి ఉంటాదని మరొక కథనం అంగారకుని పుట్టుక గురించి తెలియజేస్తోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube