'అరవింద సమేత' సక్సెస్ మీట్ కు 'బాలకృష్ణ' రావడం వెనక అసలు కారణం అదేనా.?  

Reason Behind Balakrishna To Attend Aravindha Sametha Success Meet-

బాబాయ్, అబ్బాయ్ ల మధ్య ఎనిమిదేళ్లుగా ఉన్న దూరానికి తెర పడింది. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని దగ్గరయ్యేలా చేసింది. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఎన్..

'అరవింద సమేత' సక్సెస్ మీట్ కు 'బాలకృష్ణ' రావడం వెనక అసలు కారణం అదేనా.?-Reason Behind Balakrishna To Attend Aravindha Sametha Success Meet

టి.ఆర్, కళ్యాణ్ రాం లకు తన ప్రేమను పంచాడు బాలకృష్ణ. తాజాగా అరవింద సమేత సక్సెస్ మీట్ కి బాలయ్య బాబు రావడమే దీనికి నిదర్శనం.

పరమవీర చక్ర సినిమా ఫంక్షన్ టైం లో తారక్, బాలకృష్ణ కలిశారు. మళ్ళీ ఇప్పుడు కలిశారు.

అయితే బాలకృష్ణ ఈ సక్సెస్ మీట్ కు రావడం వెనుక కారణం కళ్యాణ్ రామ్ అంట. ఎన్.

టి.ఆర్ బయోపిక్ లో బాలకృష్ణ తో పాటు నటిస్తున్న కళ్యాణ్ రాం తమ్ముడి సక్సెస్ మీట్ కు రావాల్సిందని బాలయ్యను కోరాడట. కళ్యాణ్ రాం కోరిక మేరకే బాలయ్య వచ్చారట..

అరవింద సమేత ఆడియో వేడుకకు బాలయ్య బాబు గారు వస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు…కానీ బాలయ్య బాబు తండ్రి బయోపిక్ చిత్రీకరణ వల్ల రాలేకపోయారు. ఇక ఇప్పుడు రాకుంటే అభిమానులు నిరాశ పడతారు అనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈ సక్సెస్ మీట్ కి వచ్చారు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నందమూరి అభిమానులంతా ముగ్గుర్ని ఒకే స్టేజీపై చూసి పండగ చేసుకుంటున్నారు. అయితే కొంత మంది నెటిజెన్స్ మాత్రం ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగమే అని విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వారంతా కలిసి ఉండడం సినీ అభిమానులకు హ్యాపీ.