'అరవింద సమేత' ఆడియో లాంచ్ కు 'బాలకృష్ణ' ఎందుకు రాలేదో తెలుసా.? అసలు కారణం ఇదే.!  

ఎన్టీఆర్ అరవింద సమేత కోసం తీరిక లేకుండా గడుపుతున్నాడు. రిలీజ్ కు కొన్ని రోజులే ఉండడంతో చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబందించిన విషయాల గురించే కాకుండా తన తండ్రిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం త్రివిక్రమ్,తారక్, జ‌గ‌ప‌తిబాబు కాంబినేషన్ తమన్ బాణీలు అందించడం…చాలా రోజుల తర్వాత సునీల్ ఈ సినిమాలో కమెడియన్ గా కనిపించడం..

Reason Behind Balakrishna Not Attending Aravinda Sametha Audio Launch-

Reason Behind Balakrishna Not Attending Aravinda Sametha Audio Launch

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవలే జరిగింది. అయితే ఈ వేడుకకు బాలకృష్ణ వస్తారని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కళ్యాణ్ రామ్, తారక్ లను సొంత బిడ్డలుగా చూసుకోడం మనం ఫొటోల్లో చూసాము. అయితే ఈ వేడుకకు బాలకృష్ణ ఎందుకు రాలేదని తారక్ ని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు దానికి తారక్ ఏమన్నారంటే…

“నేనంటే బాబాయ్ కి చాలా ఇష్టం. ఇక నాన్న హరికృష్ణ అంటే బాబాయ్ కి చాలా చాలా ఇష్టం. నాన్న పోయినపుడు బాబాయ్ అక్కడే ఉంటూ కనీసం ఫుడ్ కూడా ముట్టలేదు. ఇక ఫంక్షన్ కి వస్తానని చెప్పిన బాబాయ్ నాలో ఎమోషన్ చూసాక నేను రాలేనురా సారి.. అని చెప్పాడు” అని వివరించాడు.