ప‌వ‌న్‌కు బాబు స‌పోర్ట్ వెన‌క మ‌ర్మ‌మేమిటో

ఇష్ట‌మైన వాడు, కావాల్సిన‌వాడు, అవ‌స‌రం ఉన్న‌వాడు.గ‌ట్టిగా కొట్టినా.

 Reason Behind Ap Cm Support To Pawan ..?-TeluguStop.com

మెత్త‌గానే ఉంద‌నే రోజులివి! ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అవ‌లంబిస్తున్నారు.త‌న‌కు త‌న టీడీపీ ప‌రివారానికి ఎంతో కావాల‌సిన వ్య‌క్తి, 2014 ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చేందుకు త‌మ వెంటే ఉండి ఎంతో క‌ష్టించి ప్ర‌చారం చేసి పెట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎంత‌గా విమ‌ర్శిస్తున్నా.

బాబు స‌ర్దుకుపోతున్నారు!! ఆ.ఆయ‌న ఏమ‌న్నారు? అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారుకూడా!! దీనిని బ‌ట్టి.ప‌వ‌న్‌ను బాబు దువ్వుతున్నార‌ని, 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని చాక‌చ‌క్యంగా అడుగులు వేస్తున్నార‌ని అనుకుంటున్నారు విశ్లేష‌కులు.

ఇటీవ‌ల అనంత‌పురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ పెద్ద ఎత్తున అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అవినీతికి కేరాఫ్‌గా అధికార పార్టీ నేత‌లు మారార‌ని అన్నారు.కేవ‌లం అమ‌రావ‌తిపైనే కాన్సంట్రేట్ చేస్తున్నార‌ని, మిగిలిన ప్రాంతాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు.దీనివల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు పెరుగుతాయ‌ని చెప్పారు.అదేస‌మ‌యంలో తాను మొద‌టి నుంచి స‌మ‌ర్ధిస్తూ వ‌చ్చిన ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపైనా ప‌వ‌న్ మ‌రోసారి గ‌ళం విప్పారు.

ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఎందుకని ప్ర‌శ్నించారు.మొత్తం కేంద్రం నుంచి రావాల్సిన ప‌న్నుల‌ను ఓ ప్యాకెట్‌లో పెట్టి.

దానికి ప్యాకేజీ అని పేరుపెట్టి ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ‌తా లేకుండా ఇస్తున్నార‌ని అన్న ప‌వ‌న్ దీనిని చంద్ర‌బాబు ఎలా స్వాగ‌తిస్తార‌ని ప్ర‌శ్నించారు.ఈ విమ‌ర్శ‌ల‌పై పెద్ద ఎత్తున టీడీపీ నుంచి రియాక్ష‌న్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు.

అయితే, అనూహ్యంగా టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు వెలువ‌డ్డాయి.ఈ పార్టీ విజ‌య‌వాడ ఎమ్మెల్యే బొండా ఉమా.ప‌వ‌న్ త‌మ‌కు శ‌త్రువుకాడ‌ని, ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌ను పాజిటివ్‌గా తీసుకుంటామ‌ని అన్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా సీఎం చంద్ర‌బాబు .జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల‌పై స్పందించారు .ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్లో ఎలాంటి త‌ప్పులూ త‌న‌కు క‌నిపించ‌లేద‌ని ఆయ‌న అన్నారు.జనసేన అధ్యక్షుడు ‘పవన్‌కళ్యాణ్‌’ ప్రత్యేకహోదా విషయంలో ‘అనంతపురం’లో అన్నదాంట్లో నాకేమీ తప్పుకనిపించడం లేదు…! హోదా ఇవ్వం…నిధులు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం…ప్యాకేజీ ప్రకటించడానికే రెండేళ్లు సమయం తీసుకుంటే చెప్పిన ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారన్న అతని మాటల్లో నిజం ఉంది.అని తాజాగా నిర్వ‌హించిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో బాబు వ్యాఖ్యానించారు.

దీనిని బ‌ట్టి.ప‌వ‌న్‌ను బాబు దువ్వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఎన్ని విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ 2019లో ప‌వ‌న్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పై తిరిగి విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ని అంటున్నారు.

ఇవే విమ‌ర్శ‌లు జ‌గ‌న్ చేసి ఉంటే మేట‌ర్ మ‌రో విధంగా ఉండేద‌ని తెలుస్తోంది.మ‌రి బాబు వ్యూహం ఎంత మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube