బన్ని అందుకే రిస్క్ తీసుకుంటున్నాడట..!

మెగా సపోర్ట్ తో అల్లు హీరోగా స్టాండర్డ్ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఇమేజ్ తన మీద ఆధారపడే స్టేజ్ కు వచ్చాడు.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఏ స్టార్ హీరోకి సాధ్య పడని హ్యాట్రిక్ 50 కోట్ల షేర్ ను సాధించి కేక పెట్టించాడు.

 Reasons For Stylish Star Movie With Harish Shankar-TeluguStop.com

ఈ సమ్మర్లో మాస్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సరైనోడు తన తర్వాత సినిమాను హరీష్ శంకర్ తో తీస్తున్న సంగతి తెలిసిందే.అయితే గబ్బర్ సింగ్, మిరపాయ్ రెండు హిట్లు, సుబ్రమణ్యం ఫర్ సేల్ యావరేజ్ మరి ఇలాంటి దర్శకుడితో బన్ని ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు అంటే.

దానికో లెక్క ఉంది అంటున్నాడట.

గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అందరికి తెలిసిందే.

హరీష్ చెప్పిన కథకు కన్విన్స్ అయిన బన్ని సినిమా కొత్తగా ఉంటుందని సన్నిహితులతో అంటున్నాడట.హరీష్ చెప్పిన కథ చెప్పినట్టుగా తీసే సత్తా తనకు ఉందనే నమ్మకంతో సినిమాకు ఒకే చెప్పాడట.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడం విశేషం.మరి స్టైలిష్ స్టార్ ను మరింత స్టైలిష్ గా చూపించేందుకు రెడీ అయిన హరీష్ కు ఏ సినిమా అయిన మెమరబుల్ హిట్ ఇచ్చి తనను స్టార్ డైరక్టర్ గా చేస్తుందో లేదో చూద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube