భారతీయుడు 2 షూటింగ్ వాయిదా వెనుక అసలు కారణం  

భారతీయుడు 2 షూటింగ్ ఆలస్యానికి కారణం చెప్పిన శంకర్. .

Reasons Behind Bharateeyudu 2 Movie Shooting Delay-kamal Haasan,kollywood,reasons,shooting Delay,tollywood

ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం భారతీయుడు 2, 20 ఏళ్ల క్రితం కమల్ హసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడుకి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనిలో కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, సిద్దార్ద్, శింబు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ ప్రారంభిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగకుండా గ్యాప్ వస్తూ ఉంది. ఇప్పటికి ఈ సినిమా మూడు సార్లు షూటింగ్ మధ్య వాయిదా పడుతూ వచ్చింది..

భారతీయుడు 2 షూటింగ్ వాయిదా వెనుక అసలు కారణం -Reasons Behind Bharateeyudu 2 Movie Shooting Delay

ఇక ఈ సినిమా ఎలా గ్యాప్ రావడానికి కారణం కమల్ హసన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయాలలో బిజీగా ఉన్న కమల్ సినిమా షూటింగ్ కి విరామం ఇచ్చినట్లు తెలుస్తుంది.

లోక్ సభ ఎన్నికల అనంతరం మరల షూటింగ్ మొదలెట్టి రెగ్యులర్ షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.