సుశాంత్ నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీకు చాలా దగ్గరయ్యను: సారా అలీఖాన్

Really Missing My Mansoor Sara Ali Khan Pays Heartfelt Tribute To Sushant Singh Rajput On 3 Years Of Kedarnath

దివంగత నటుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన విషయం అందరికి తెలిసిందే.సుశాంత్ మరణం వార్తతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురయింది.

 Really Missing My Mansoor Sara Ali Khan Pays Heartfelt Tribute To Sushant Singh Rajput On 3 Years Of Kedarnath-TeluguStop.com

సుశాంత్ సింగ్ మరణ వార్త అప్పట్లో పలువురు ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది.ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తాజాగా సుశాంత్ ని తలచుకొని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా అలీ ఖాన్ కలిసి నటించిన సినిమా కేదార్ నాథ్. ఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

 Really Missing My Mansoor Sara Ali Khan Pays Heartfelt Tribute To Sushant Singh Rajput On 3 Years Of Kedarnath-సుశాంత్ నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీకు చాలా దగ్గరయ్యాను: సారా అలీఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సుశాంత్ ను గుర్తు చేసుకున్న సారా రియల్లీ మిస్సింగ్ మై మన్సూర్ అంటూ హృదయ పూర్వకంగా నివాళులు అర్పించింది.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా సుశాంత్ సింగ్ నటించిన కొన్ని ఎమోషనల్ సీన్ లను షేర్ చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.

ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.3 సంవత్సరాల క్రితం నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఫుల్ ఫీల్ అయ్యింది.

ఒక నటిగా అత్యంత ప్రత్యేకమైన నా మొదటి చిత్రం విడుదల అయ్యింది.కేదార్ నాథ్ సినిమా అంటే ఏమిటో ఇప్పటికీ నేను పూర్తిగా వివరించగలనో లేదో నాకు తెలియదు.కానీ అక్కడి స్థలాలు సినిమా జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నా మనసులో అలాగే నిలిచి పోయాయని ఆమె తెలిపింది.

ఈ సినిమా సమయంలో తనకు సుశాంత్ ఇచ్చిన మద్దతు మార్గదర్శకత్వం కారణంగా నేను మీ హృదయాన్ని తెలుసుకోగలిగాను.ఆ పాత్రలో నన్ను చూసి అందరూ గర్వపడేలా చేసినందుకు అతనికి ధన్యవాదాలు.జై బోలేనాథ్.

హర హర మహాదేవ్.కేదార్ నాథ్ అనే క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సుశాంత్ అభిమానులు స్పందించారు.

#Sara Ali Khan #SushanthSingh #Kedarnath #Sushant Singh #Sushanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube