ఇంజనీరింగ్ చదువుకొని బిక్షాటన! రియల్ బిచ్చగాడు స్టొరీ  

Real Bicchagaadu Story On Puri Jagannath Temple-puri Jagannath Temple,real Bicchagaadu Story

తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కోటీస్వరుడైన కొడుకు బిచ్చగాడుగా మారడం అనే కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా బిచ్చగాడు.ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయ్యింది.

Real Bicchagaadu Story On Puri Jagannath Temple-puri Jagannath Temple,real Bicchagaadu Story Telugu Viral News Real Bicchagaadu Story On Puri Jagannath Temple-puri Temple Real-Real Bicchagaadu Story On Puri Jagannath Temple-Puri Temple

ఈ సినిమా ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా చేసుకొని తీసినట్లు దర్శకుడు అప్పట్లో ప్రకటించాడు.ఇప్పుడు ఇంచుమించు అలాంటి ఘటన ఓడిస్సాలోని పూరీలో కనిపించింది.

ఓ బిచ్చగాడు పూరీ జగన్నాథ్ ఆలయం వద్ద బిక్షాటన చేసుకుంటున్నాడు.అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

అయితే అతను ఎవరనే విషయం చెప్పడానికి అతను నిరాకరించడంతో పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయారు.

గిరిజా శంకర్‌ మిశ్రా (51).పూరిలోని జగన్నాథ్‌ ఆలయం వద్ద అడుక్కొంటూ బతుకుతున్నాడు.మాసిన బట్టలు, నెరిసిన గడ్డంతో దొరికిన రోజు తింటూ, దొరకని రోజు పస్తులుంటూ చలి, వానను లెక్కచేయకుండా రాత్రుళ్లు ప్లాట్‌ఫాంపైనే నిద్రిస్తున్నాడు.

ఇటీవల మిశ్రాతో ఓ రిక్షావాలా గొడవపడ్డాడు.స్థానికులు ఆ ఇద్దరినీ పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు.అక్కడ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో రిక్షావాలా తనకు రాయడం రాదని చెప్పాడు.మిశ్రా మాత్రం పెన్ను, పేపర్‌ తీసుకొని ఇంగ్లిషులో ఫిర్యాదు రాశాడు.

ఆరులైన్లతో ఎలాంటి అచ్చు తప్పులు లేకుండా ఇంగ్లీష్ లో రాయడంతో పోలీసులు షాక్ తిన్నారు.దీంతో అతని గురించి ఆరా తీసిన పోలీసులకి తన గురించి కొన్ని విషయాలు చెప్పాడు.

తనది భువనేశ్వర్‌ అనే ఉన్నత కుటుంబానికి చెందిన తన తల్లిదండ్రులు చనిపోయారని తెలిపాడు.తండ్రి పోలీసు అధికారిగా పనిచేశాడు.బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత సెంట్రల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ చదివాడు.ముంబైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు.తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి మిల్టన్‌ కంపెనీలో పనిచేశాడు.తర్వాత పూరీకొచ్చి బిచ్చగాడిగా మారిపోయాడు.ఇంజనీర్‌గా ఉన్న నువ్వు ఇలా ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నావ్‌ అని పోలీసులు ప్రశ్నిస్తే.‘సారీ.ఇది నా పర్సనల్‌ మ్యాటర్‌’ అంటూ వెళ్లిపోయాడు.అతని కథ విన్న పోలీసులు ఇదేదో సినిమా కథలా ఉందని చెప్పుకోవడం విశేషం.

.

తాజా వార్తలు

Real Bicchagaadu Story On Puri Jagannath Temple-puri Jagannath Temple,real Bicchagaadu Story Related....