రియల్ స్టోరీ : భార్యని బాగా చదివించడం కోసం దుబాయ్ కి వెళ్ళాడు… దాంతో భార్య …  

Real story married men went dubai for his wife studies but his wife cheated, Raju, love story, Women Cheating, mentally disturbing, Bangalore, Karnataka - Telugu Bangalore, Karnataka, Love Story, Mentally Disturbing, Raju, Real Story Married Men Went Dubai For His Wife Studies But His Wife Cheated, Women Cheating

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం చేసేటువంటి పనులను చూస్తుంటే కన్నీళ్లు రాక మానవు.ఇటీవలే ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితో సుఖంగా బ్రతికేందుకు ఏకంగా కట్టుకున్న భర్తను సైతం మోసం చేసి చివరికి అతడు పిచ్చోడు అయ్యేలా చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

TeluguStop.com - Real Story Married Men Went Dubai For His Wife Studies But His Wife Cheated

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో రాజు అనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు చిన్నప్పుడే తన తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా అష్ట కష్టాలు పడుతూ బైక్ మెకానిక్ పనులను నేర్చుకొని సొంతంగా నిలదొక్కుకున్నడు.

ఈ క్రమంలో శిరీష (పేరు మార్చాం) అనే యువతిని పెళ్ళిచేసుకున్నాడు.అయితే రాజు శిరీష ని పెళ్లి చేసుకునే సమయంలో ఆమె డిగ్రీ చదువుతోంది.దీంతో పెళ్లయిన తర్వాత కూడా శిరీష చదువుపై ఆసక్తి చూపడంతో రాజు కూడా కాదనలేకపోయాడు.దీంతో శిరీష డిగ్రీ తర్వాత పీజీ కూడా చేసింది.

TeluguStop.com - రియల్ స్టోరీ : భార్యని బాగా చదివించడం కోసం దుబాయ్ కి వెళ్ళాడు… దాంతో భార్య …-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ రాజు ఏమి చదువుకోక పోవడంతో శిరీష తన భర్తను చూసి అప్పుడప్పుడు నామోషీగా ఫీల్ అవుతుంది.ఈ క్రమంలో ఆమెకు వేరే యువకుడితో ప్రేమలో పడింది.

దాంతో తన భర్తను వదిలించుకునేందుకు తన పై చదువులకు మరింత డబ్బు అవసరమవుతుందని కాబట్టి దుబాయ్ కి వెళ్లి డబ్బు సంపాదించాలని, దీంతో మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని అంటూ మాయమాటలు చెప్పి రాజుని దుబాయ్ కి పంపించింది. దీంతో రాజు తన భార్య మాటలు నమ్మి దుబాయ్ కి వెళ్లి బాగానే డబ్బు సంపాదించాడు.

అయితే రాజు తిరిగి వచ్చే క్రమంలో శిరీష అతడికి ఫోన్ చేసి డబ్బులను తన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించడంతో ఆమె మాటలను నమ్మిన  రాజు దాదాపుగా 10 లక్షల రూపాయలను జమ చేశాడు.అనంతరం చాలా కాలం తర్వాత తన భార్యని చూసేందుకు గాను స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి రాజు తన భార్య చేసినటువంటి పనికి పిచ్చి వాడయ్యాడు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే శిరీష ప్రేమ పెళ్లి పేరుతో తన భర్త రాజుని డబ్బు కోసం మోసం చేసిందని ఇప్పటికీ రాజు నివాసం ఉంటున్న ప్రాంతంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం రాజు రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతూ చాలా దీన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు.

దీంతో ఇటీవలే ఓ ఎంజీవో సంస్థ అతడిని చేరదీసి ఆశ్రయం ఇచ్చింది. అయితే అతడి భార్య శిరీష డబ్బు కోసం తన భర్త ను మోసం చేశాననే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా తన ప్రియుడితో సుఖంగా ఉంటున్నట్లు సమాచారం.

#Love Story #RealStory #Bangalore #Women Cheating #Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Real Story Married Men Went Dubai For His Wife Studies But His Wife Cheated Related Telugu News,Photos/Pics,Images..