సైకిల్ పై షూటింగ్ కి వెళ్ళిన సోనూసూద్

గత ఏడాది కరోనా సమయంలో వలస కార్మికులకి అండగా నిలబడి తనలోని మానవత్వాన్ని చాటుకొని విశేషమైన గుర్తింపుని అర్ధించిన నటుడు సోనూసూద్.ఎక్కడో ఉన్న వలస కార్మికుల కోసం, బస్సు లు, ట్రైన్ లు, విమానం ఏర్పాటు చేసి సొంత ఊళ్ళకి పంపించాడు.

 Real Star Sonu Soods Surprise Entry To Acharya Location-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సోనూసూద్ రియల్ హీరోగా మారిపోయాడు.అలాగే కష్టం అంటూ ఎవరు కనిపించిన పెద్ద మనసుతో వెంటనే ఆదుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో అతని క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలని సైతం మించిపోయింది.ఇంతకాలం మనం సినిమాలలో విలన్ గా చూసిన సోనూసూద్ గొప్ప మనసుకి ప్రతి ఒక్కరు నీరాజనాలు పట్టారు.

 Real Star Sonu Soods Surprise Entry To Acharya Location-సైకిల్ పై షూటింగ్ కి వెళ్ళిన సోనూసూద్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతని ద్వారా సాయం పొందిన కొంత మంది అయితే ఏకంగా తమ పిల్లలకి సోనూసూద్ పేరు పెట్టేసుకున్నారు.అలాగే తాము స్టార్ట్ చేసిన వ్యాపారలకి కూడా కొందరూ సోనూసూద్ పేరుని ఉపయోగించుకున్నారు.

ఇదంతా కేవలం అతని మీద ఉన్న అభిమానంతోనే చేశారు.ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోనూసూద్ కి స్టార్ హీరోలతో సమానమైన ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఈ కారణంగానే సినిమాలలో కూడా ఒకప్పటిలా విలన్ పాత్రలలో కాకుండా అతని కోసం దర్శకుడు కాస్తా హీరోయిక్ ఇమేజ్ ఉన్న పాత్రలని డిజైన్ చేస్తున్నారు.ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అతను కనిపించబోతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది.

ఈ షూటింగ్ కోసం సోనూసూద్ ఏకంగా సైకిల్ పై వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.ఇక రోడ్డు మీద సోనూసూద్ సైకిల్ తొక్కుతూ కనిపించడంతో కొంత మంది ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టారు.

ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి.దాదాపు అరగంట పాటు సైక్లింగ్ చేసి సోనూసూద్ లొకేషన్ కి చేరుకోవడం విశేషం.

#RealStar #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు