భారతదేశ వ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ( Shivalayam ) ఉన్నాయి.అతిపెద్ద ఆలయాలు కూడా పరమేశ్వరుడికి అంకితం చేయబడ్డాయి.
అయితే ఏ శివాలయంలోకి వెళ్లిన మనకు శివుడి మెడలో నాగుపాము( Cobra Snake ) కనిపిస్తుంది.అంటే నాగుపాము విగ్రహంలో ఒక భాగంగా ఉంటుంది.
అయితే నిజజీవితంలో నిజమైన పాములు శివుడు మెడలోకి వచ్చి నాట్యం చేసే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.దీన్ని చూసి చాలామంది ప్రజలు అది దైవ మహత్యం అని నమ్ముతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని( Andhra Pradesh ) విజయనగరం జిల్లాలో వైయస్సార్ నగర్ కాలనీవాసులకు ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది.కాలనీవాసులు గణేష్ చతుర్థి( Ganesh Chaturthi ) సందర్భంగా కొద్ది రోజుల క్రితం ఎంతో అద్భుతంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఆ మండపంలో శివపార్వతుల విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు.కొందరు భయపడిపోయారు.అసలు విషయంలోకి వెళ్తే గణేష్ మండపంలో ప్రతిష్టించిన శివుడి మెడలో ఒక నాగుపాము ప్రత్యక్షమైంది.
ఆ పాము శివుని మెడ చుట్టూ చుట్టుకొని బుసలు కొట్టడం మొదలు పెట్టింది.దాంతో అక్కడ ఉన్న భక్తులంతా భయపడిపోయారు.వెంటనే నిర్వాహకులు స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు.కొద్దిసేపటికి స్నేక్ క్యాచర్ అక్కడికి వెళ్లి ఆ నాగుపాముని పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
దాంతో భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది.
పామేంటి శివుడు మెడలోకి వచ్చి నాట్యం చేయడమేంటి విడ్డూరంగా ఉందే అని కొందరు అనుకుంటున్నారు.ఇంకొందరు అది దైవ మహత్యం అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.