దీపావళి రోజున అంత‌రిక్షం నుంచి భార‌త్ ఎలా ఉందో తెలుసా..? ఫోటోలు మీరే చూడండి!  

Real Pic Of India From Space On Diwali-

Diwali is not just in our country but many people around the world celebrate this festival. We have recently celebrated Diwali festival. As usual, all the patriarchs blew and celebrated the festival. But NASA does not do this every time with satellite photography on Diwali every year. Because every Saturday Diwali day, NASA's satellite photograph is not original. NASA has been sharing the photo every time. It was then that NASA was laughing when everyone knew that the photo was not original. This year NASA did not release the Diwali version. But a man has released it.

.

His name is Paulo Nespoli. He is an astronaut (astronaut) in the European Space Agency (ESA). He has been on the International Space Station as part of a mission for some time. On this occasion, Paulo shared his Bharat photo from space on Diwali day in his Twitter account. .

..

..

..

 • దీపావ‌ళి అంటే కేవ‌లం మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే మ‌నం దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నాం.

 • దీపావళి రోజున అంత‌రిక్షం నుంచి భార‌త్ ఎలా ఉందో తెలుసా..? ఫోటోలు మీరే చూడండి!-Real Pic Of India From Space On Diwali

 • య‌థావిధిగా అంద‌రూ ప‌టాకులు పేల్చి ఉత్సాహంగా పండుగ‌ను జ‌రుపుకున్నారు. అయితే ప్ర‌తి ఏటా దీపావ‌ళి రోజున భార‌త్‌ను శాటిలైట్ ఫొటో తీసే నాసా ఈ సారి అలా చేయ‌లేదు.

 • ఎందుకంటే ప్రతి సారీ దీపావ‌ళి రోజున నాసా విడుద‌ల చేస్తున్న భార‌త దేశ శాటిలైట్ ఫొటో అస‌లుది కాద‌ట‌. ఎప్పుడో తీసిన ఫొటోను నాసా ప్ర‌తి ఏటా షేర్ చేస్తూ వ‌స్తోంది.

 • దీంతో ఆ ఫొటో అస‌లుది కాద‌ని ఎప్పుడైతే అంద‌రికీ తెలిసిందో అప్పుడే నాసా న‌వ్వుల పాలైంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది నాసా దీపావ‌ళి ఫొటోను విడుద‌ల చేయ‌లేదు.

 • అయితే ఓ వ్య‌క్తి దాన్ని విడుద‌ల చేశాడు.

  Real Pic Of India From Space On Diwali-

  అత‌ని పేరు పౌలో నెస్పోలి. ఇత‌ను యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో వ్యోమ‌గామి (అస్ట్రోనాట్‌)గా ప‌నిచేస్తున్నాడు.

 • గ‌త కొంత కాలంగా ఓ మిష‌న్ లో భాగంగా ఇత‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే పౌలో దీపావ‌ళి రోజున అంత‌రిక్షం నుంచి తీసిన భార‌త్ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

 • Real Pic Of India From Space On Diwali-

  దీంతో ఆ ఫొటో కాస్తా వైర‌ల్ అయింది. కొన్ని గంట‌ల్లోనే ఆ ఫొటో కొన్ని వేల సంఖ్య‌లో షేర్ అయింది. వేల కొద్ది లైక్‌లు, కామెంట్లు వ‌చ్చాయి.

 • పోస్టులో పౌలో హ్యాపీ దివాలీ అని చెబుతూ ఆ ఫొటోను పెట్టారు. దీనికి గాను చాలా మంది భార‌తీయులు అత‌నికి థాంక్స్ చెప్పారు.

 • ! ఆ ఫొటోను మీరు పైన వీక్షించ‌వ‌చ్చు.!