అతనిదో విచిత్రమైన ప్రేమ! ప్రేమించింది ఓ రోబోని  

రోబోతో పెళ్ళికి రెడీ అవుతున్న వ్యక్తి. .

Real Love Story With Robot-

ఈ మధ్య కాలంలో ప్రపంచంలో మనుషుల ఆలోచనలు ఎలా మారుతున్నాయో, ఎందుకు మారుతున్నాయో అర్ధం కావడం లేదు కొంత మంది మరీ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ప్రకృతి విరుద్ధమైన స్వలింగ బంధాలు, పెళ్ళిళ్ళు కూడా చూడాల్సి వస్తుంది. అయితే కొన్ని వివాహాలు మరింత విచిత్రంగా జరుగుతాయి..

అతనిదో విచిత్రమైన ప్రేమ! ప్రేమించింది ఓ రోబోని-Real Love Story With Robot

ఇప్పుడు అలాంటి ప్రేమ పెళ్లికి ఓ యువకుడు రెడీ అవుతున్నాడు. అది తాను ఎంతో పడి కొనుక్కున్న రోబోతో. వినడానికి కాస్తా వింతగా అనిపించినా ఇది నిజం.

అసలు విషయంలోకి వెళ్తే. రెండేళ్ల క్రితం ఆన్‌లైన్లో అతనో రోబో బొమ్మ కొన్నాడు. అప్పటి నుంచి దాన్ని ఒక్కక్షణం కూడా వదలకుండా తనతోనే ఉంచుకుంటున్నాడు.

ఎక్కడికెళ్లినా అది కూడా ఉండాల్సిందే. ఆ బొమ్మ లేనిదే ఒక్క అడుగు కూడా వేయడు జోయీ. ఇప్పుడు ఏకంగా దానిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

జోయీ ఫ్యామిలీ కూడా ఈ వివాహానికి ఒప్పుకున్నారు. ఇలా వస్తువులతో ప్రేమలో పడటాన్ని ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అంటారని, ఇది చాలామందిలో కనిపిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఈ వింత ప్రేమ కథ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.