రియల్‌ లైఫ్‌ లో 'ఆర్‌ఎక్స్‌ 100'... క్లైమాక్స్‌ మాత్రం రివర్స్‌

మారుతున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మవద్దు అన్నట్లుగా పరిస్థితి తయారు అయ్యింది.కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు ఇలాంటి మనుషులు మన మద్యలో ఉన్నారా, మనతో కూడా అలా ఏమైనా వ్యవహరిస్తున్నారా అనే భయం కలుగుతుంది.

 Real Life Rx 100 Movie Story In Uttara Pradesh 100-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా జీవితంపై చాలా ఆశలు, అంచనాలు పెట్టుకుని బతికేస్తూ ఉంటారు.కాని కొందరు జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి నాశనం చేసేస్తారు.

చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనేలా చేస్తారు.అత్యంత కఠిన పరిస్థితులు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరు ఊహించరు.

ముఖ్యంగా ప్రేమికులు కొందరు దారుణంగా మోసపోతూ ఉంటారు.అయితే మోస పోయేవారిలో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారని అనుకుంటాం కాని, అబ్బాయిలు కూడా తక్కువేం కాకుండా మోసపోతున్నారు.

ఇక్కడ అక్కడ, మన దేశం ఇతర దేశం అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేమ పేరుతో మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు.యూపీలో ఒక సంఘటన జరిగింది.

అది అచ్చు తెలుగులో వచ్చి సూపర్‌ హిట్‌ అయిన మూవీ ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని పోలి ఉంది.ఆ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆటో మెకానిక్‌ గా చేసే కమలేష్‌ కష్టపడి కుటుంబంను పోషిస్తూ ఉండేవాడు.

కమలేష్‌ ఆటో గ్యారేజ్‌ పక్కనే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది.ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెద్ద జాబర్స్‌ అవ్వడంతో ఒంటరిగానే ఆమె ఉండేది.

ఒంటరితనం ఆమె చెడు అలవాట్లకు బానిస అయ్యింది.స్నేహితులతో కలిసి మందు తాగడం, సిగరెట్‌ తాగడం వంటివి చేసింది.

రియల్‌ లైఫ్‌ లో 'ఆర్‌ఎక్స్‌ 100'

అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఆమె కమలేష్‌ను చూసింది.చూడగానే అతడు నచ్చాడు.ఒంటిపై ఉన్న షర్ట్‌కు అంతా కూడా ఆయిల్‌ ఉన్నా కూడా ఆమె మాత్రం అతడి మ్యాన్లీ లుక్‌ను ఇష్టపడింది.మెల్లగా అతడికి ఆ విషయం చెప్పింది.తక్కువ సమయంలోనే అతడిని ఇంట్లోకి కూడా తీసుకు వెళ్లింది.ఏ మగాడైనా కూడా అమ్మాయి కోరికను కాదనలేడు.

అలా ఇద్దరి మద్య శారీరక కలయిక కూడా జరిగింది.మూడు నాలుగు నెలలు ఇలాగే జరిగింది.

ఆ తర్వాత సడెన్‌ గా ఆమె మాట్లాడటం మానేసింది, ఫోన్‌ బ్లాక్‌ చేసింది.ఒక రోజు డైరెక్ట్‌గా కలిసి అడిగితే ఇద్దరం ఎంజాయ్‌ చేశాం, వదిలేయ్‌, నాకు పెళ్లి కుదిరింది, యూఎస్‌లో అబ్బాయి జాబ్‌, నాకు కూడా అక్కడ జాబ్‌ చూస్తా అన్నాడు, ఇద్దరం కలిసి అక్కడ జాబ్‌ చేస్తూ సెటిల్‌ అవ్వాలనుకుంటున్నాం అంటూ బాంబు పేల్చింది.

ఆమె మాటలకు అతడు షాక్‌ అయ్యాడు.

రియల్‌ లైఫ్‌ లో 'ఆర్‌ఎక్స్‌ 100'

ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందా అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.కాని ఆమె మాత్రం నేను ప్రేమించలేదు, నువ్వు దాన్ని ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను అంటూ ఆమె తెగేసి చెప్పింది.దాంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది.

ఏం చేయాలో పాలుపోలేదు.మోసం చేసినందుకు ఆమెను చంపేయాలన్నంత కోపం వచ్చింది, ఒక రోజు ఆమె ఒంటరిగా కనిపిస్తే ఆ కోపంలో చంపేశాడు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కమలేష్‌ కు లైఫ్‌ పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube