ఆకాశంలో ఎగిరి చూపించిన రియల్ ఐరన్ మెన్

ఐరన్ మెన్ సినిమా చూసిన వారికి అందులో హీరో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఒక మిషన్ షూట్ తయారు చేసుకొని ఆకాశంలో ఎంత దూరమైనా ఎగిరిపోతాడు.ఆ సినిమా హాలీవుడ్ లో వచ్చి రికార్డులు సృష్టించడంతో పాటు ఆ క్యారెక్టర్ తో ఐదు సీక్వెల్స్ వరకు వచ్చాయి.

 Real Life Iron Man Hover 6000 Feet Above Dubai-TeluguStop.com

అయితే అలాంటి క్యారెక్టర్ నిజజీవితంలో ఉంటుందా… ఆ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం మనకి అందుబాటులో ఉందా అనే సందేహాలు చాలా మందికి వస్తాయి.అసలు సాధ్యం కాదనే అభిప్రాయానికి కూడా జనం వచ్చేస్తారు.

అయితే ఓ వ్యక్తి మాత్రం రియల్ ఐరన్ మెన్ లో ఆకాశంలో ఎగిరి అద్బుతంగా సృష్టించాడు.మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు.

అతనే ఫ్రాన్స్ కి చెందిన వెనీస్ రెఫెట్

దుబాయ్ వేదికంగా ఈ సాహసం చేశాడు.జెట్ రెక్కల సాయంతో ఐరన్ మెన్ లో గగనతలంలోకి దూసుకుపోయాడు.

ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఎగరలేనంత ఎత్తుకి ఎగిరి మళ్ళీ తిరిగొచ్చాడు.సుమారు 1800 మీటర్ల అంటే 6000 అడుగులు ఎత్తుకు వెనీస్ ఎగిరి ఆశ్చర్యపరిచాడు.

కార్బన్ ఫైర్ వింగ్స్ కలిగిన జెట్ ప్యాక్స్ సాయంతో వెనీస్ ఈ సాహసానికి పూనుకున్నాడు.ఈ సాహసానికి వాడిన వింగ్స్ లో మొత్తం నాలుగు మినీ జెట్ ఇంజిన్స్ ని అతను అమర్చాడు.

వీటి ద్వారా గంటకు 400 కిలోమీటర్లు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయాడు.ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఎక్స్పో 2020 దుబాయ్ లో మరోసారి ఈ స్టంట్ ను ప్రదర్శించడానికి అతను రెడీ అవుతున్నాడు.

మొత్తానికి సినిమాలో సృష్టించిన పాత్రలు ఏదో ఒక రోజు నిజ జీవితంలో మనకి తారసపడతాయంటే ఈ వెనీస్ ని చూస్తే అర్ధమవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube