సోనూసూద్ గొప్పదనంపై పాట.. రియల్ హీరో ఏమన్నారంటే?

కలియుగ కర్ణుడిగా సోనూసూద్ దేశంలోని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెబితే వేగంగా స్పందించి కష్టాల్లో ఉన్నవాళ్ల సమస్యల పరిష్కారం కొరకు సోనూసూద్ కృషి చేస్తున్నారు.

 Real Hero Sonusood Praises Telugustop Song-TeluguStop.com

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోనూసూద్ యొక్క సేవలను ప్రశంసిస్తున్నారు.సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి సహాయం చేసే వీలు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

రాజకీయాలు, సినిమాలు, ఇతర విశేషాలను వేగంగా పాఠకులకు చేరవేస్తున్న ప్రముఖ వెబ్ సైట్లలో ఒకటైన తెలుగు స్టాప్.కామ్ రియల్ హీరో సోనూసూద్ సేవలను ప్రశంసిస్తూ పేదవారి గుండెల్లో వెలిగే రూపం భరతజాతి గర్వించే బుద్ధుని రూపం పేరుతో ఒక పాటను రూపొందించగా ఆ పాటను సోనూసూద్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

 Real Hero Sonusood Praises Telugustop Song-సోనూసూద్ గొప్పదనంపై పాట.. రియల్ హీరో ఏమన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పాటకు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తుండటంతో పాటు నెటిజన్లు పాట ఎంతో బాగుందని ప్రశంసిస్తున్నారు.

రియల్ హీరో సోనూసూద్ ఈ పాటను షేర్ చేయడం ద్వారా ఈ పాట తనకు కూడా ఎంతగానో నచ్చిందని చెప్పకనే చెప్పేశారు.ఇతర భాషల్లోకి కూడా ఈ పాటను డబ్ చేయాలని సోనూసూద్ ను అభిమానించే ఇతర రాష్ట్రాల అభిమానులు కోరుతుండటం గమనార్హం.మరి కొందరు ఇతర రాష్ట్రాల నెటిజన్లు పాట భాషను తాము అర్థం చేసుకోలేకపోయినా భావం అర్థమైందని చెప్పుకొచ్చారు.

సోనూసూద్ తనను అభిమానించే వాళ్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో సోనూసూద్ స్థాయిలో మంచి పేరును, పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తి మరొకరు లేరనే చెప్పాలి.ఆచార్య సినిమాలో సోనూసూద్ ప్రతినాయకుని పాత్రలో నటిస్తుండగా సోనూసూద్ ఫ్యాన్స్ మాత్రం ఇకపై సోనూసూద్ పాజిటివ్ రోల్స్ లోనే నటించాలని కోరుకుంటున్నారు.రియల్ హీరో సోనూసూద్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

#Telugustop Song #Corona Warrior

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు