సోనూసూద్ మంచి మనస్సు.. అంధురాలి చేతుల మీదుగా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం!

రియల్ హీరో సోనూసూద్ చేస్తున్న మంచి పనులతో పాటు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి.రోజురోజుకు సోనూసూద్ చేస్తున్న మంచి పనుల ద్వారా మరింత ఎక్కువ మందికి చేరువవుతున్నారు.

 Real Hero Sonusood Kind Gesture Toward Blind Girl Nagalaxmi Donatation To Sonuso-TeluguStop.com

సోనూసూద్ కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేయడంతో దేశంలోని చాలామంది సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే సోనూసూద్ కు విరాళాలు ఇచ్చిన వాళ్లలో అంధురాలు అయిన బొడ్డు నాగలక్ష్మి అనే మహిళ కూడా ఉన్నారు.

తన 5 నెలల పింఛన్ 15,000 రూపాయలను బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు.ఈ విషయం తెలిసిన రియల్ హీరో సోనూసూద్ చలించిపోవడంతో పాటు ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడి ఆమెను ప్రశంసించారు.

బొడ్డు నాగలక్ష్మి దేశంలోని పెద్ద ధనవంతురాలు అని సోనూసూద్ గతంలో మెచ్చుకున్నారు.

రేపు ఆంధ్రప్రదేశ్ లో బొడ్డు నాగలక్ష్మి చేత ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించనున్నామని సోనూసూద్ తాజాగా ట్వీట్ చేశారు.సోనూసూద్ ఫౌండేషన్ కు సహాయం చేసిన నాగలక్ష్మిని గుర్తు పెట్టుకుని మరీ ఆమెచేత ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం అయ్యేలా నిర్ణయం తీసుకున్న సోనూసూద్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు.

రేపు ఉదయం 11.15 గంటలకు ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగనుంది.సోనూసూద్ పేద విద్యార్థులకు సైతం ప్రయోజనం చేకూరే విధంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.కరోనా కేసులు తగ్గుతున్నా సోనూసూద్ మాత్రం తన సేవలను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో సోనూసూద్ కు ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సోనూసూద్ కు తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సోనూసూద్ కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube