శివ శంకర్ మాస్టర్ కు సోనూ సూద్ సాయం..!

Real Hero Sonusood Help For Shiva Shankar Master Treatment

ప్రముఖ కొరియోగ్రాఫర్, క్లాసికల్ డ్యాన్సర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతున్నారు.లంగ్స్ లో 70 శాతం వరకు ఇంఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.

 Real Hero Sonusood Help For Shiva Shankar Master Treatment-TeluguStop.com

ఓ పక్క శివ శంకర్ మాస్టర్ తనయుడు కూడా కరోనాతో బాధపడుతున్నారట.ఆయన అవుట్ ఆఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇంట్లో శివ శంకర్ మాస్టర్ సతీమణి కూడా కరోనాతో హోం క్వారెంటైన్ లో ఉన్నారట.ఇక శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సాయం అడుగుతున్నారు.

 Real Hero Sonusood Help For Shiva Shankar Master Treatment-శివ శంకర్ మాస్టర్ కు సోనూ సూద్ సాయం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఎక్కడ ఆపద అంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సోనూ సూద్ శివ శంకర్ మాస్టర్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.శివ శంకర్ మాస్టర్ కోలుకునేందుకు ఎలాంటి సాయమైనా చేస్తానని సోనూ సూద్ తన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

ఇప్పటికే కరోనా టైం లో ఎంతోమందికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్ ఇప్పటికి తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండగా వైద్యులు ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

 శివ శంకర్ ట్రీట్ మెంట్ కు ఆర్ధిక సాయం చేస్తున్న సోనూ సూద్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Choreographer #Sonusood #SonusoodShankar #ShankarMaster #COVID

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube