రూ.3 కోట్ల కారు వార్తలను ఖండించిన సోనూ సూద్‌.. అసలు విషయం ఏంటీ?

ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా సోనూ సూద్‌ ను దేవుడు.రియల్‌ హీరో అంటూ పూజిస్తున్నారు.

 Real Hero Sonu Sood Denies Buying New Car For His Son-TeluguStop.com

కొన్ని చోట్ల ఆయన విగ్రహాలకు మాలలు వేసి మరీ ఆరాధిస్తున్నారు.అంతటి అద్బుతమైన ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న సోనూ సూద్‌ కు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

అయితే ఇటీవల ఆయన తన కొడుకు 18 ఏళ్లు నిండిన నేపథ్యం లో కారును బహుమానంగా ఇవ్వడం జరిగిందట.ఏకంగా మూడు కోట్లు పెట్టి మార్కెట్ లోకి కొత్త గా వచ్చిన కొత్త మోడల్ కారును కొడుకు కు ఫాదర్స్ డే కానుకగా కొని ఇవ్వడం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి.

 Real Hero Sonu Sood Denies Buying New Car For His Son-రూ.3 కోట్ల కారు వార్తలను ఖండించిన సోనూ సూద్‌.. అసలు విషయం ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన కూడా కొత్త కారు వీడియో ను షేర్‌ చేశాడు.రాత్రి సమయంలో వర్షం లోనే కొత్త కారు సోనూ సూద్‌ ఇంటికి వచ్చింది.

ఆ సమయంలోనే కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక రౌండ్ వేసి టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు.వరుసగా సోనూ సూద్‌ కు సంబంధించిన వార్తలు మీడియా లో పెద్ద ఎత్తున రావడంతో చర్చనీయాంశంగా మారింది.

సోనూ సూద్ తన కొడుకు కోసం మూడు కోట్లు పెట్టి కారు కొనడంను కొందరు తప్పుబడుతున్నారు.18 ఏళ్ల కుర్రాడికి అంత ఖరీదైన కారు అవసరమా.అయినా ఖరీదైన కారు కొడుకు కు ఇవ్వడమే బహుమానమా అంటూ కొందరు ప్రశ్నించారు.ఈ విషయం మై కొందరు చేసిన ఆరోపణలు మరియు మరి కొందరు చేసిన విమర్శల నేపథ్యంలో సోనూ సూద్‌ స్పందించాడు.

తన కొత్త కారు కొడుకు కోసం కొన్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు.అయితే వీడియో లో మాత్రం ఆయనే స్వయంగా కొడుకు కోసం అన్నట్లుగా పేర్కొన్నాడు.

విమర్శల కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.తాను కొన్న కారు కొడుకు కోసం కాదని మీడియాలో వస్తున్న వార్తలను ఖండించడంతో పాటు ఈ విషయాన్ని మరింతగా రాద్దాంతం చేయనక్కర్లేదు అంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

#Fathers Day #SonuSood #CommentsOn #Real Hero #SonuSood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు