సోనూసూద్‌ ఇక తెలుగు సినిమాల్లో కనిపించడం కష్టమేనా?

సౌత్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన సోనూ సూద్‌ మెల్లగా టాలీవుడ్‌ ప్రేక్షకులకు విలన్ గా దూరం అవుతాడా అంటే నిజమే అవ్వొచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన రియల్‌ హీరోగా మారిపోయాడు.

 Real Hero Sonu Sood Demanding High Remuneration, Akhanda, Film News, Real Hero S-TeluguStop.com

ప్రభుత్వాలు మాత్రమే కాకుండా గొప్ప నాయకులు కూడా చేయలేని సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు.వందల కోట్ల రూపాయలను ఆయన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు.

ఈ సమయంలో ఆయన ఏ సినిమా లో నటించినా కూడా అంతకు మించి అన్నట్లుగా ఆ సినిమా రేంజ్‌ పెరుగుతుంది.అందుకే ఆ సినిమాల బజ్ భారీగా పెరగడంతో పాటు బిజినెస్ కూడా భారీగా చేస్తున్నాయి.

అందుకే సోనూ సూద్‌ కు పెద్ద మొత్తంలో ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఆఫర్లు వస్తున్నా కూడా వాటిని ఒప్పుకునేందుకు సోనూ సూద్‌ పెత్త మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నాడు.

గతంలో సోనూసూద్‌ ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌ పాత్రలకు రెండు కోట్ల వరకు తీసుకునే వాడు.మరీ కీలకం అయితే అప్పుడు మూడు కోట్ల వరకు తీసుకునేవాడు.ఆయన మూడు కోట్ల పారితోషికం తీసుకున్న సినిమాలు చాలా చాలా తక్కువ.అలాంటి సోనూసూద్‌ ఇప్పుడు ఏకంగా ఏడు కోట్ల పారితోషికంను డిమాండ్‌ చేస్తున్నాడు.

చిన్న పాత్ర చేసేందుకు కూడా అయిదు కోట్ల వరకు పారితోషికంను అడుగుతున్నాడట.ఇటీవల బోయపాటి శ్రీను అఖండ సినిమా కోసం సోనూ సూద్‌ ను సంప్రదించాడట.

ఏకంగా ఏడు కోట్ల రూపాయలను డిమాండ్‌ చేయడంతో ఒక సెల్యూట్‌ కొట్టి బాబోయ్ అంటూ అక్కడ నుండి బోయపాటి వచ్చేశాడట.సోనూసూద్‌ కు బాలయ్య కంటే ఎక్కువ పారితోషికం ఇస్తామంటూ బోయపాటి భావించి మరో నటుడిని ఎంపిక చేశాడు.

ఇక సోనూసూద్ త్వరలో ఆచార్య సినిమా ద్వారా రాబోతున్నాడు.ఆచార్య సినిమాను 2019 లోనే కమిట్‌ అయ్యాడు.

కనుక ఆ సమయంలో ఆయన పారితోషికం రెండున్నర కోట్లుగా ఒప్పందం జరిగింది.కాని ఇకపై ఏడు కోట్లు కావాలంటున్నాడు కనుక ఆయన్ను విలన్‌ గా భరించడం ఎవరి వల్ల కాదంటూ నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube