పొలిటికల్ ఎంట్రీపై రియల్ హీరో సోనూసూద్ క్లారిటీ... ఏమన్నాడంటే?

ప్రస్తుతం కరోనా దేశ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే.కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

 Real Hero Sonu Sood Clarity On Political Entry-TeluguStop.com

కరోనా మొదటి వేవ్ లో కేసులు నమోదైనా ఇంతలా మరణాలు మాత్రం సంభవించలేదు.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది.ఈ సమయంలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోవడం, ఆక్సిజన్ కొరత వేధించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

 Real Hero Sonu Sood Clarity On Political Entry-పొలిటికల్ ఎంట్రీపై రియల్ హీరో సోనూసూద్ క్లారిటీ… ఏమన్నాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వాలు ఇక చేతులెత్తేసిన పరిస్థితి ఉంది.ఇక ఇంతటి క్లిష్ట సమయంలో మొదటి వేవ్ కరోనాలో ఎలాగైతే వలస కార్మికులకు అండగా నిలబడ్డాడో ఈ సారి కూడా దేవుడిలా క్లిష్ట పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకరావడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఎవరికి అత్యవసర సహాయం ఉన్నా పది నిమిషాలలో సమస్యను పరిష్కరిస్తూ దేశ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మారాడు.

ఇక తోటి వారికి సహాయం చేయాలని గొప్ప మనసున్న వారు సీఎం రిలీఫ్ ఫండ్, పీఎం కేర్ కు కాక సోనూసూద్ ఫౌండేషన్ కు ఖచ్చితంగా కోవిడ్ బాధితులకు చేరుతాయనే ఉద్దేశ్యంతో విరాళాలను ప్రకటిస్తున్నారు.దీంతో నెటిజన్లు భవిష్యత్ ప్రధాని అంటూ సోనూసూద్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అయితే పొలిటికల్ ఎంట్రీపై రియల్ హీరో సోనూసూద్ స్పందించాడు.నేను సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నా, నేను రాజకీయాలలోకి వచ్చి నేను ఏం చేయగలను, సామాన్య వ్యక్తిగా ఉంటూనే సేవలందిస్తానని సోనూసూద్ తెలిపారు.

#@SonuSoodArmy #BollywoodActor #Actor Sonusood #SonuSood #India Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు