వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధం ..అమెరికా కంపెనీల కీలక ప్రకటన !

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి గజగజ వణికిపోతోంది .చైనాలో వ్యూహన్ లో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకింది.

 Covid19 , Corona Virus, Corona , Usa , Trump, Pfizer, Moderna-TeluguStop.com

ప్రపంచ దేశాల పెద్దన్నగా పిలవబడే అమెరికా సైతం కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అయింది.ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ కరోనాని అరికట్టే సరైన వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు కీలక ప్రకటన చేశాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువగా అమెరికాలో కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి కరోనా వ్యాక్సిన్‌ లు సిద్ధమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చెప్తున్నారు.ఈ పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ విషయంలో తాము సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్, మోడెర్నా వెల్లడించాయి.

అమెరికన్‌ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ‌ల అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నాయి.అయితే అత్యవసర అనుమతి వచ్చిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై సందిగ్ధత ఉంది.

</br.

ఇక మరో కంపెనీ మసాచుసెట్స్‌ బయోటెక్‌ సంస్థ మోడెర్నా నవంబర్‌ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ చైర్మన్‌, సీఈఓ అల్బర్ట్‌ బౌర్లా ఓ ప్రకటనలో తెలిపారు.మొత్తంగా ఏడాది చివరికల్లా రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి.నవంబర్‌ మూడో వారంలో టీకాలు ఆమోదం పొందినప్పటికీ.అవి విస్తృతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube