యూఏఈకి వెళ్తున్నారా.. ఆడుతూ పాడుతూ ఎయిర్‌పోర్ట్‌కు వస్తే కుదరదు, ఎయిరిండియా కీలక సూచన ..?

కరోనా నేపథ్యంలో పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తివేస్తూ యూఏఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

 Reach Airport Six Hours Before Departure Says Air India Express , Uae,  Pcr Test-TeluguStop.com

ఇక ఈ ప్రకటన రావడంతో భారతీయులతో పాటు పలు దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇన్నాళ్ల తమ ఎదురుచూపులు ఫలించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

దీంతో యూఏఈ తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడ్డారు.అయితే గతంలో మాదిరిగా ప్రయాణానికి గంట, రెండు గంటల ముందు ఆడుతూ పాడుతూ ఎయిర్‌పోర్ట్‌కు వస్తే కుదరదట.

కనీసం ఆరు గంటల ముందు విమానాశ్రాయానికి రావాల్సి వుంటుందని భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ఎందుకంటే యూఏఈలో ఎంట్రీ నిబంధనల ప్రకారం పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

కనుక ప్రతి ప్రయాణికుడికి విమానాశ్రయంలో రాపిడ్ పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు.ఈ టెస్టు కౌంటర్లు ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు తెరచుకుంటాయని.

అలాగే విమానం బయల్దేరడానికి రెండు గంటల ముందు మూతపడతాయి.అందుకే ప్రయాణికులు కనీసం ఆరు గంటల ముందు విమానాశ్రయాలకు చేరుకోవాలి అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం తన ప్రకటనలో పేర్కొంది.

కాగా, భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.

కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది.అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

అలాగే యూఏఈ ప్రయాణానికి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా రావొచ్చునని.ఇలాంటి వారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది.

ప్రధాన రంగాలైన హెల్త్ వర్కర్స్ (వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని షనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది.

Telugu Afghanistan, Bangladesh, Federalidentity, India, Indonesia, Nigeria, Paki

ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం యూఏఈ రావాలనుకునే ప్రయాణీకులు.ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.టీకా సర్టిఫికేట్‌లతో పాటు ప్రయాణికులు బయల్దేరే 48 గంటల లోపే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.

అలాగే వారు విమానం ఎక్కేముందు కూడా ల్యాబ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.యూఏఈ చేరుకున్న వెంటనే మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి.హోం క్వారంటైన్‌కు తరలిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube