జ్యోతి రీపోస్ట్ మార్టం! ఆందోళన చేస్తున్న బంధువులు!

అమరావతిలో ప్రేమ జంట దాడి కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది.అసలు వారిపై దాడి ఎవరు చేసారో అనే విషయాన్ని ఇప్పటి వరకు కనిపెత్తలేకపోయిన పోలీసులు మరో వైపు ప్రేమజంటలో ప్రేమికుడుని విచారించకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

 Re Postmortem To Jyothi Dead Body In Mangalagiri Murder Case-TeluguStop.com

ఇప్పటికే పోస్ట్ మార్టం చేసిన బాడీకి మరోసారి రీ పోస్ట్ మార్టం చేయడంపై మరణించిన జ్యోతి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన తీవ్రతరం చేసారు.తమ కుమార్తెని శ్రీనివాస్ హత్యా చేసాడని, అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేయకుండా అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేసారు.

డాక్టర్స్ కూడా వారికి సహకరించి శ్రీనివాస్ మతిస్థిమితం కోల్పోయాడని, అతను ఎలాంటి విషయాలకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేడని, అతని అన్ని మరిచిపోయాడని చెబుతున్నారు.

పోలీసులు కూడా దీనిని నిజమని చెప్పడంతో ఇప్పుడు జ్యోతి బంధువుల అనుమానాలు మరింత బలపడ్డాయి.

తాము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం కావడం వలెనే పోలీసులు, డాక్టర్స్ అందరూ కుమ్మక్కై కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని, హంతకులని తప్పించే ప్రయత్నం చేయడం చేస్తున్నారని జ్యోతి తండ్రి, బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు.ఈ జ్యోతి విచారణలో సరైన విధంగా వ్యవహరించాలేదనే ఆరోపణలతో ఎస్సై, సిఐపై చర్య తీసుకోవడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీ చెబుతున్నారు.

జ్యోతిని ఎవరు చంపారనే విషయం మీద పారదర్శకంగా విచారణ చేసి హంతకులని పట్టుకుంటాం అని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, అధికార పార్టీ నాయకులు గాని జ్యోతి హత్యపై ఎలాంటి వాఖ్యలు చేయకపోవడం చూస్తూ వుంటే నేరస్తులకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే అనుమానం కలుగుతుందని జ్యోతి తండ్రి ఆరోపిస్తున్నారు.

మరి ఈ జ్యోతి మర్డర్ మిస్టరీలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయో, అలాగే బందులు ఆందోళన తీవ్రత ఎ స్థాయికి చేరుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube