ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్! కారణం అదే  

ఏపీలో ఐదు సెంటర్ లలో రీపోలింగ్. .

Re-polling In Five Centers In Andhra Pradesh-

ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలలో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.ఇక ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ పార్టీలు చాలా చోట్ల అక్రమాలకి తెరతీసినట్లు ఆరోపణలు వచ్చాయి.అలాగే కొన్ని చోట్ల ఈవిఎం మిషన్ లని బద్దలు చేయడం, అలాగే వీవీ ప్యాట్ స్లిప్ లని అనధికారంగా ఉపయోగించారని ఆరోపణలు వ్హచ్చాయి..

Re-polling In Five Centers In Andhra Pradesh--Re-polling In Five Centers Andhra Pradesh-

ఎన్నికల సంఘం అధికారులు కూడా చాలా చోట్ల అక్రమాలకి పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపడానికి ఎన్నికల సంఘం సిద్ధం అవుతుంది.నెల్లూరు జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో రెండు , ప్రకాశం‌లో ఒక చోట రీపోలింగ్‌కి ఎన్నికల సంఘానికి ఆయా కలెక్టర్లు నివేదికలు పంపారు.

దీంతో ఈ ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయింది.ఆర్వో, ఏఆర్వో‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.