ట్రైలర్‌ టాక్‌ : 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' ఇంత పెద్ద ట్విస్ట్‌ ఇచ్చిందేంటి?  

Rdx Love Trailer Talk-rdx Love

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోయిన్‌గా కుర్ర హృదయాలను బద్దలు కొట్టిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌.ఈ అమ్మడు తాజాగా ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ చిత్రంలో నటించింది.త్వరలోనే ఆ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.ఈ చిత్రం కాస్త లేడీ ఓరియంటెడ్‌ మూవీ టైప్‌ ఉంటుందని అనిపిస్తుంది.టీజర్‌లో ఈ చిత్రంలో రొమాన్స్‌ ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారు.టీజర్‌తో కుర్రోళ్ల గుండెలు వేగం అందుకున్నాయి.సినిమాలో హాట్‌ సీన్స్‌ హద్దులు మీరి ఉంటాయని అంతా భావించారు.

Rdx Love Trailer Talk-rdx Love-RDX Love Trailer Talk-Rdx

Rdx Love Trailer Talk-rdx Love-RDX Love Trailer Talk-Rdx

కట్‌ చేస్తే నిన్న ట్రైలర్‌ విడుదల అయ్యింది.ట్రైలర్‌లో మొత్తం మారిపోయింది.రొమాన్స్‌ కంటే వయలెన్స్‌ ఎక్కువగా ఈ చిత్రంలో ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.పాయల్‌ రాజ్‌ పూత్‌ చేసే రొమాన్స్‌ కంటే ఫైట్స్‌ ఎక్కువగా ఈ చిత్రంలో ఉంటాయని అనిపిస్తుంది.

ట్రైలర్‌లో రొమాన్స్‌ లేకపోవడంతో తీవ్రంగా ప్రేక్షకులు నిరాశ చెందినట్లుగా అనిపిస్తుంది.సినిమాలో పాయల్‌ అందాల ఆరబోతతో పాటు రొమాంటిక్‌ సీన్స్‌ చెప్పలేనన్ని ఉంటాయని అంతా భావించారు.కాని అనూహ్యంగా ట్రైలర్‌ విడుదల తర్వాత నిరుత్సాహం మిగిలింది.

పాయల్‌ మూవీ అంటే ప్రేక్షకులు రొమాన్స్‌ను కోరుకుంటున్నారు.కాని ఇందులో ఆ దాఖలాలు ఏమీ కనిపించడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఊరించి మరీ ఇలా ఉసూరుమనిపించడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ చిత్రం ట్రైలర్‌ గురించి చర్చ జరుగుతోంది.ఇలా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి.వాటికి ఈ చిత్రంలో విభిన్నంగా పాయల్‌ గ్లామర్‌ ఉంటే కాస్త ఆడే అవకాశం ఉంది.కాని ఆశించిన స్థాయిలో ఈ చిత్రంలో పాయల్‌ అందాల ప్రదర్శణ లేదేమో అనిపిస్తుంది.