ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో బెంగళూర్ మ్యాచ్ .. ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఉన్నాయి చూడండి..  

Rcb Vs Dc Match Prediction Who Will Win-

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు వరుసగా 5 మ్యాచ్ లలో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ స్థానాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు మిగితా అన్ని మ్యాచ్ లలో గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్ బరిలో ఉంటుంది. ఈ రోజు సొంత గ్రౌండ్ లో బెంగళూర్ జట్టు ఢిల్లీ తో ఆడనుంది. అటువైపు ఢిల్లీ జట్టు కూడా వరుస ఓటములతో ఫామ్ లేక సతమతమవుతున్నారు..

ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో బెంగళూర్ మ్యాచ్ .. ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఉన్నాయి చూడండి..-RCB Vs DC Match Prediction Who Will Win

ఆ జట్టు బ్యాట్స్ మెన్ వరుస వైఫల్యాల కారణం వల్ల జట్టు భారీ స్కోర్ చేయలేకపోవుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకి కీలకం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో బెంగళూర్ జట్టు ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ బరిలో నుండి తప్పుకున్నట్లే.

ఇకపోతే ఢిల్లీ జట్టు ఓపెనర్లతో సహా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణిస్తే ఆ జట్టుకి గెలిచే అవకాశం ఉంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ రికార్డులు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 22 మ్యాచ్ లు జరగగా బెంగళూర్ జట్టు 15 గెలవగా , ఢిల్లీ జట్టు 6 విజయాలతో ఉంది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండడం తో పాటు పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది. మరొకసారి భారీ స్కోర్ ఆశించవచ్చు..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

3)ఢిల్లీ జట్టు బలం యువకులతో కూడిన బలమైన బ్యాటింగ్ లైన్ అప్ కానీ ఆ జట్టు లో చాలా మంది ఆటగాళ్లు ఫామ్ లో లేరు. ప్రిథ్వీ షా ఒక మ్యాచ్ లో మినహా అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. ధావన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఒకటి కూడా ఆడలేదు.

రిషబ్ పంత్ , ఇంగ్రామ్ ల పరిస్థితి ఇదే. ఇకపోతే బౌలింగ్ లో రబడ , అక్షర్ పటేల్ , బౌల్ట్ లతో బాగానే కనిపిస్తుంది..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – ప్రిథ్వీ షా , శిఖర్ ధావన్ , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కోలిన్ ఇంగ్రామ్ , అక్షర్ పటేల్ , ట్రెంట్ బౌల్ట్ , రబడ , ఇషాంత్ శర్మ , తేవాటియా ,సందీప్ లమిచ్చానే

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా తో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరుపించిన , బౌలింగ్ లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన తో 5 బంతులు మిగిలి ఉండగాన్నే లక్ష్యాన్ని సమర్పించుకుంది. సిరాజ్ , సైని లతో పాటు టాప్ క్లాస్ బౌలర్ టీం సౌతి కూడా ధారాళంగా పరుగులు ఇచ్చాడు.

ఫీల్డింగ్ లో లెక్కలేనన్ని క్యాచ్ లు వదిలేశారు. ఈ మ్యాచ్ లో బెంగళూర్ లక్ష్య చేదన చేస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , కోహ్లీ , డివిలియర్స్ , మెయిన్ అలీ ,మార్కస్ స్టయినిస్ , అక్షదీప్ నాథ్ , పవన్ నెగి , చాహల్ , సుందర్ ,ఉమేష్ యాదవ్ , టీమ్ సౌతి