ఈ రోజు నుండే ఐపీఎల్ ప్రారంభం, తొలి మ్యాచ్ లో చెన్నై తో బెంగళూర్ ఢీ .. ఏ జట్టుకు గెలిచే అవకాశం ఎక్కువో చూడండి...

ఈ రోజు నుండే ఐపీఎల్ 12 మ్యాచ్ లు ప్రారంభం.మొదటి మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరగనుంది.

 Rcb Vs Csk Ipl 2019 Match Prediction Who Will Win-TeluguStop.com

ఐపీఎల్ లో ఎప్పుడు ఈ రెండు జట్ల మధ్య పోటాపోటీ సమరం ఉంటుంది.బ్యాటింగ్ బెంగళూర్ బలం అయితే చెన్నై కి అనుభవజ్ఞులై న ఆటగాళ్లు ఉండడం బలం.చెపాక్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించడం తో ఇక్కడ ముందుగా టాస్ గెలిచిన జట్టు లక్ష్య చేదనకు ఇష్టపడుతుంది.చాలా కాలంగా ఏ బి డివిలియర్స్ ఇండియా లో ఆడడం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చే విషయం.

ఇప్పటి వరకు వీరి మధ్య జరిగిన మ్యాచ్ లు


ధోని సారథ్యం లో ని చెన్నై సూపర్ కింగ్స్ , విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఇప్పటి వరకు 23 మ్యాచ్ లు జరగగా చెన్నై జట్టే ఆధిపత్యం కొనసాగించి 15 మ్యాచ్ లు గెలవగా బెంగళూర్ జట్టు కేవలం 7 మ్యాచ్ లే గెలిచింది , ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.ఈ 23 మ్యాచ్ లలో చెన్నై లో 7 సార్లు పోటీపడగా చెన్నై 6 సార్లు బెంగళూర్ ఒక్కసారి గెలిచింది.

జట్లు ఏవిధంగా ఉండబోతున్నాయి

చెన్నై సూపర్ కింగ్స్

మాజీ ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై ఈ సారి గెలుపుతో ఐపీఎల్ ని ఆరంభించాలనుకుంటుంది.సొంత గడ్డ పై ఆడడంతో అభిమానుల సపోర్ట్ ఎక్కువగా ఉండడం చెన్నైకి కలిసొచ్చే విషయం.మొదటి మ్యాచ్ లో చెన్నై జట్టు ఈ విధంగా ఉండబోతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Probable ) : అంబటి రాయుడు , షేన్ వాట్సన్ , డూప్లెసిస్ , బ్రావో , సురేష్ రైనా , ఎం ఎస్ ధోని , కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా/డేవిడ్ విల్లీ , దీపక్ చహార్ , శార్దూల్ థాకూర్ ,కరణ్ శర్మ .

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడంతో ఈ సారి అయిన గెలవలన్న తపనతో ఈ సీజన్ గెలుపుతో స్టార్ట్ చేయలనుకుంటుంది బెంగళూర్ జట్టు.భీకరమైన బ్యాటింగ్ ఆర్డర్ బెంగళూర్ సొంత ఏ ఒక్కరు చివరిదాకా నిలబడిన ఆ జట్టు గెలవడం సునాయసం అయిపోతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( Probable ) : విరాట్ కోహ్లీ , పార్థివ్ పటేల్ , షిమ్రాన్ హెట్ మేయర్ , ఏ బి డివిలియర్స్ , కోలిన్ డి గ్రాండి హోమ్ , శివమ్ ధూబె , చాహల్ , సుందర్ , ఉమేష్ యాదవ్ , టీమ్ సౌథీ , నవదీప్ సైనీ.

ఏ జట్టుకు గెలుపు అవకాశం ఎక్కువ

చెన్నై కి బెంగళూర్ కి జరిగిన గత మ్యాచ్ లతో పోలిస్తే బెంగళూర్ జట్టు ఈ సారి పటిష్టంగా మంచి బౌలింగ్ తో ఉంది , బ్యాటింగ్ గురించి చెప్పనక్కర్లేదు .ఒకవేళ బెంగళూర్ జట్టు బౌలింగ్ లో రాణిస్తే ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువే.ఇటువైపు చెన్నై జట్టుగా సొంత గడ్డ పైన ఆడడం చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కూడా బెంగళూర్ కి ధీటుగా ఉండడం , గత ఐపీఎల్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ధ మ్యాచ్ విజేత షేన్ వాట్సన్ మంచి ఫామ్ లో ఉండడం , బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల అల్ రౌండర్లు ఉండడం చెన్నైకి బలం .గెలుపు అవకాశాలు 50 50 ఉన్న రికార్డ్ ల పరంగా , సొంత మైదానం లో ప్రేక్షకుల సపోర్ట్ ఉండడం చెన్నైకి గెలిచే అవకాశం ఎక్కువ .

తెలుగుస్టాప్ ఐపీఎల్ PREDICTION : చెన్నై సూపర్ కింగ్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube