రూ.10 కోట్ల ఆఫర్‍‍ను సింపుల్‌గా రిజెక్ట్ చేసిన ఆర్‌సీబీ ప్లేయర్..!

ఐపీఎల్ 2022 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ క్రమంలో కీలకమైన ఘట్టాలన్నీ త్వరితగతిన పూర్తి అవుతున్నాయి.

 Rcb Player Who Simply Rejected The Rs 10 Crore Offer  Rcb Player, 10 Crores Offe-TeluguStop.com

ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.ఈ ప్రక్రియ తర్వాత కొత్తగా ఐపీఎల్ లో చేరనున్న రెండు జట్లు పికప్ ఆప్షన్ కింద ముగ్గురు చొప్పున ప్లేయర్లను ఎంపిక చేసుకోనున్నాయి.

అయితే నూతన ఫ్రాంచైజీ అయిన లక్నో ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీల ప్లేయర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే డబ్బులు ఆశ చూపి టాలెంటెడ్ ప్లేయర్లను ఆకట్టుకునేందుకు లక్నో అన్ని రూల్స్ బ్రేక్ చేసిందని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదికి వచ్చింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్‌ను లక్నో ఫ్రాంచైజీ ప్రలోభాలకు గురిచేయడానికి యత్నించిందట.ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామని బంపరాఫర్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే సిరాజ్ మాత్రం ఎన్ని కోట్లిచ్చినా.ఆర్‌సీబీ జట్టును వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారట.దాంతో లక్నో డబ్బు ఆశ చూపి సిరాజ్‌ను దక్కించుకోలేకపోయిందని తెలుస్తోంది.ఈ విషయం గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది.

అందరూ కూడా సిరాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Telugu Ipl, Rcb, Reject, Siraj, Ups-Latest News - Telugu

ఆర్‌సీబీ జట్టు కారణంగానే సిరాజ్‌కు మంచి పేరొచ్చింది.అంతేకాదు అతడి క్రికెట్ కెరీర్ బాగా మెరుగుపడింది.ఆర్‌సీబీ జట్టు తనపై విశ్వాసం ఉంచకపోతే ప్రస్తుత స్థాయికి వచ్చే వాడినే కాదని సిరాజ్ భావిస్తున్నారని టాక్.అందుకే రూ.10 కోట్ల ఆఫర్‍‍ను సింపుల్‌గా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.రిటెన్షన్ ముందే 10 కోట్లు ఆఫర్ చేసినా అతడు వెళ్లలేదు.కాగా రిటెన్షన్ ప్రక్రియ సమయంలో ఆర్‌సీబీ రూ.7 కోట్లతో సిరాజ్‌ను మళ్లీ తమ జట్టుకే అట్టి పెట్టుకుంది.రిటెన్షన్ ప్రక్రియ ముగియగానే ఆర్‌సీబీ తనని రిటైన్ చేసుకున్నందుకు మహమ్మద్ సిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

ఆర్‌సీబీ తనని రిటైన్ చేసుకోవడంతో తనకు గౌరవం దక్కినట్లు భావిస్తున్నానని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube