ఈ సారి కప్ మాదే అంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అభిమానులు , దానికి కారణాలు ఇవే ..

ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఒకటి కానీ ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఈ జట్టుకు అందని ద్రాక్షల మిగిలింది.మొదటి ఐపీఎల్ సీజన్ ని బెంగళూర్ ప్రదర్శన బాగానే ఉన్నా ఆ జట్టు బౌలింగ్ అంత ఆకట్టుకోలేదు.

 Rcb Fans About Ipl 12th Session-TeluguStop.com

అందుకే బెంగళూర్ ని సౌత్ ఆఫ్రికా జట్టు తో పోలుస్తారు , అన్ని ఉన్న ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు .అలాగే బెంగళూర్ జట్టు లో కూడా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న జట్టు.విరాట్ కోహ్లీ , ఏబి డివిలియర్స్ , గతేడాది వరకు గేల్ లాంటి భయంకర టీ20 బ్యాట్స్ మెన్ లతో ఉన్న కానీ ఆ జట్టు ఐపీఎల్ గెలవకపోవడం అభిమానులను నిరుత్సాహపరుస్తుంది.ఈ జట్టు పైన ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా లో చాలా ట్రోల్స్ చేస్తున్నారు.

ఆర్.సి.బి జట్టు 2009 లో 2016 లో ఐపీఎల్ ఫైనల్ ఆడగా రెండింటిలో గెలుపుకి దగ్గరగా వచ్చి ఓటమి పాలైంది.

ఈ సారి జట్టు ఎలా ఉంది


గత ఏడాది నుండి విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉండటం ఏ బి డివిలియర్స్ లాంటి ఆటగాడు ఈ మధ్య జరిగిన బంగ్లాదేశ్ , పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు.

వీరితో పాటు వెస్టిండీస్ యువ సంచలనం హెట్ మేయర్ , మార్కస్ స్టయిన్స్ , పార్థివ్ పటేల్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది.బౌలింగ్ లో కూడా సౌతి , కౌంటర్ నైల్ , చాహల్ , ఉమేష్ యాదవ్ లతో పటిష్టంగా ఉంది.

బెంగళూర్ అభిమానులకి ఈ సారి కప్ పైన నమ్మకం ఎందుకు

1.ఈ ఏడాది ఆరంభం లో జరిగిన ఇండియన్ బాడ్మింటన్ లీగ్ సీజన్ 4 లో ముంబై రాకెట్స్ పైన బెంగళూర్ రపీటర్స్ పైన 3-2 తేడాతో గెలిచి బెంగళూర్ కి మొదటి బాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ని అందించింది.

2.2019 ప్రో కబడ్డీ లీగ్ లో బెంగళూర్ బుల్స్ జట్టు గుజరత ఫార్చూన్ జెయింట్స్ పైన ఫైనల్ లో 38-33 పాయింట్ల తేడాతో గెలిచి తొలిసారి కప్ సొంతం చేసుకుంది.

3.ప్రతి ఏడాది జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 లో ఈ ఏడాది మనీష్ పాండే సారథ్యం లో మహారాష్ట్ర జట్టు పైన కర్ణాటక జట్టు విజయం సాధించింది.

ఆడిన 7 మ్యాచ్ లలో ఏడూ విజయాలు సొంతం చేసుకొని తొలిసారి కర్ణాటక జట్టు కప్ గెలిచేసింది.

4.ఇక ఫుట్ బాల్ విషయానికొస్తే , ఇండియన్ ఫుట్ బాల్ సూపర్ లీగ్ లో బెంగళూర్ జట్టు గోవా పైన ఫైనల్ లో 1-0 తేడాతో గెలిచి ట్రోఫీ ని దక్కిచుకుంది.బెంగళూర్ జట్టుకు భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ అయిన సునీల్ చెత్రి కెప్టెన్సీ గా వ్యవహరించాడు.

ఇక బెంగళూర్ గెలవాల్సింది ఐపీఎల్ కప్ మాత్రమే అందుకే బెంగళూర్ అభిమానులు ( EE SAALA CUP NAMDE ) ఈ సారి కప్ మాదే అని ధీమాగా ఉన్నారు.ఈ సారి అయిన ఆ జట్టుకు లక్ కలిసొస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube