ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ నటిస్తున్న సినిమా టైటిల్ నేడు రివీలైంది.చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ అంటూ టైటిల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు.
శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్.శంకర్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగాల్సిందే.
అయితే ఐ, 2.ఓ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేదు.అందుకే శంకర్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు.
ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ తో శంకర్ గేమ్ చేంజర్ అంటూ అదిరిపోయే సినిమాతో వస్తున్నారు.ఈ సినిమా నిజంగానే బాక్సాఫీస దగ్గర గేమ్ చేంజ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది.2024 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవట్లేదు దిల్ రాజు.చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు.అది కూడా పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.