మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘RC15’.శంకర్ సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈయన సినిమాలో నటించే అవకాశం వస్తే ఆ నటుడి దశ తిరిగినట్టే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.ఇక ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఇక తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ ను పూణే లో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అక్కడ భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసారు.తాజాగా మొదటి షెడ్యూల్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామ్ చరణ్, కియారా పై జరగబోతుందట.
మొదటి షెడ్యూల్ దాదాపుగా నెల రోజులు జరగనుందట.ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను పూణే లో పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ లో చరణ్, కియారా పై ఒక సాంగ్ కూడా ఉండబోతున్నట్టు టాక్.అందుకోసం అప్పుడే సాంగ్ కూడా రెడీ అయిపోయిందట.
ఇక మొదటి షెడ్యూల్ నెల రోజుల తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కియారా బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ.ఈమె చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి.ఇక ఈ బ్యూటీ శంకర్ కు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చేవిధంగా ఒప్పుకుందట.
ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడవ వారం తర్వాత నుండి దాదాపు 20 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారం.ఇక రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులన్నీ ముగించుకుని శంకర్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.