రైతులకు పండగలాంటి వార్త చెప్పిన ఆర్బీఐ  

Rbi Raises Collateral Farm Loan Limit-

రైతులకు ఆర్బీఐ పండుగలాంటి వార్తను చెప్పింది.మానిటరీ పాలసీలో రైతులకు పెద్ద బహుమానాన్ని ప్రకటించింది.రైతులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచేసింది.రైతులకు గ్యారంటీ లేని రుణం మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది.2010లో రైతులకు పూచీ లేకుండా ఇచ్చే రుణంపై రూ.1 లక్ష పరిమితి విధించారు.కానీ 2010 తర్వాత ద్రవ్యోల్బణం చాలా పెరిగిందని వ్యవసాయంలో ఇన్ పుట్ వ్యయం కూడా పెరిగిన కారణంగా హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Rbi Raises Collateral Farm Loan Limit--Rbi Raises Collateral Free Farm Loan Limit-

రైతులకు అందించే గ్యారంటీ లేకుండా రుణాన్ని రూ.1 లక్ష నుంచి పెంచి రూ.1.6 లక్షలు చేసినట్టు పేర్కొంది.ఈ నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని బ్యాంక్ చెప్పింది.దీనిని అమలు చేసేందుకు త్వరలోనే ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయనుంది.