రూల్స్ మారాయి...ఎన్నారైలు తప్పకుండా తెలుసుకోవాలి...!!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే అదే టెక్నాలజీ ను ఉపయోగించి మోసాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి.పేదలు, విద్యార్ధులు, చివరికి బ్యాంక్ ఉద్యోగులు, ఎన్నారైలు సైతం ఈ సైబర్ నేరాల బారిన పడి మోసపోతున్నారు.

 Rbi New Rules On E Mandate, E Mandate Rules For Nri, Telugu Nri News, E Mandate,-TeluguStop.com

వినియోగదారులు ఎవరైనా సరే ఈ మాయగాళ్ళ ఉచ్చులో పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.ముఖ్యంగా ఎన్నారైలు ఈ తరహా మాసాలలో కీలక భాదితులుగా గుర్తించబడటంతో భారత్ రిజర్వ్ చెల్లింపులకు సంభందించి ఈ – మాండేట్ పేరుతో కొత్త మార్గదర్సకాలను ప్రవేశపెట్టింది.

చాలా మంది ఎన్నారైలకు భారత్ లోని బ్యాంకులలో ఎకౌంట్లు, డిబేట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి.అలాంటి వారందరూ రిజర్వ్ చెల్లింపుల విషయంలో తీసుకువచ్చిన మార్పులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నూతన విధానం ప్రకారం, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసే సమయంలో ఈ నూతన విధానం వర్తిస్తుంది, అదెలాగంటే కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో కస్టమర్ అనుమతి కోరుతూ బ్యాంక్ లు ముందస్తు అలెర్ట్ లు పంపుతాయి.దాంతో కస్టమర్ కు వచ్చే మెసేజ్ లు లావాదేవీల సమయంలో బ్యాంక్ తో పంచుకోవడం ద్వారా చెల్లింపుల ప్రక్రియకు అనుమతి లభిస్తుంది.అయితే

ఒక వేళ వచ్చిన మెసేజ్ బ్యాంక్ తో పంచుకొని నేపధ్యంలో చెల్లింపులు ఆగిపోతాయి.ఈ విధానం వలన ఏ ఒక్క కస్టమర్ కూడా మోసపోయే అవకాశం ఉండదని, తద్వారా చెల్లింపులు ఎంతో సెక్యూరిటీ మధ్య జరుగుతాయని అంటున్నారు నిపుణులు.

ఈ నూతన విధానం తప్పకుండా ఎన్నారైలు తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు.ఇదిలాఉంటే డెబిట్ , క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ నూతన నిభందనలు వర్తిస్తాయని, అయితే ఎకౌంటు ల ద్వారా నేరుగా జరిగే లావాదేవీల విషయంలో ఈ నూతన విధానం వర్తించదని తెలుస్తోంది.

ఏది ఏమైనా తాజాగా తీసుకువచ్చిన ఈ నిభందనలు ఎన్నారైలు తప్పకుండా అనుసరిచాలని సూచిస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube