డెబిట్, క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపుల కోసం ఆర్బీఐ కొత్త రూల్స్

డెబిట్, క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపుల కోసం ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.

 Rbi New Rules For Debit And Credit Card Payments-TeluguStop.com

పేమెంట్‌ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.కాగా ఈ నియమాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే, టోకనైజేషన్‌ విధానంలో కార్డు అసలు వివరాలను టోకెన్‌ అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్‌తో భర్తీ చేస్తారు.దీంతో లావాదేవీని ప్రాసెస్‌ చేసే సమయంలో అసలు కార్డు వివరాలను వ్యాపార సంస్థల వద్ద షేర్‌ చేయరు.

కాబట్టి టోకనైజ్‌ చేసిన కార్డు లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని తెలిపింది.ప్రస్తుతం చెల్లింపులు చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన కార్డు నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ.

వంటి వివరాలను ఇచ్చి ఆ తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి లావాదేవీ పూర్తి చేస్తుంటాం.మొదటిసారి మాత్రమే వివరాలు ఎంటర్‌ చేస్తాం… ఆ తర్వాత వివరాలు అందించనవసరం లేదు.

ఈ సదుపాయం వల్ల వినియోగదారులకు సులభంగా సేవలు అందుతున్నప్పటికీ ఆయా యాప్‌లలో నిక్షిప్తమైన సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.దీనికి చెక్‌ పెట్టేందుకు ఆర్బీఐ టోకనైజేషన్‌ ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube